నయనానందకరం ఓంకారేశ్వరుని ఉత్సవం
|
దర్శనం కోసం రెండు గదులను దాటుకుని దేవాలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించాలి. కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఓంకారేశ్వర మరియు మామ్మలేశ్వర పుణ్య క్షేత్రాలను గురించిన ప్రస్తావన శివపురాణంలో విశేషంగా చెప్పబడింది. శివపురాణంలో చెప్పిన దాని ప్రకారం, సూర్య వంశీయుడైన మాంధాత ఇద్దరు కుమారులైన అంబరీష్ మరియు ముచికుంద్‌లు సదాశివుని ప్రసన్నం చేసుకోడం కోసం ఘోర తపస్సు చేసారు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అంతేకాక అత్యుత్తమైన త్యాగాలను వారు చేసారు; అందుకే ఓంకారేశ్వరుడు నెలవైన పర్వతానికి మాంధాత అని పేరు వచ్చింది. ఓంకారేశ్వర దేవాలయం ఉత్తర భారత శైలిలో నిర్మించబడింది. ఈ దేవాలయం కృత యుగంనాటిది. పురాణేతిహాసాలను అనుసరించి చూస్తే, వింధ్య పర్వతాన్ని సందర్శించిన దేవర్షి నారదుడు వింధ్య పర్వతం ఎదుట మేరు పర్వతం యొక్క గొప్పదనాన్ని కీర్తిస్తూ గానం చేసాడు.
|
గానసారంతో దిగాలు పడిన వింధ్య పర్వతం పరమేశ్వరుని వేడుకొనగా, ఓంకారేశ్వర మరియు అమలేశ్వరులుగా ప్రత్యక్షమైన మహాశివుడు, శివభక్తులకు ఆటంకం కలుగని రీతిలో పెరిగే వరాన్ని వింధ్య పర్వతానికి అందించాడు. కానీ వరగర్వంతో విర్రవీగిన వింధ్య తన పెరుగుదులను పరిమితం చేసుకోలేదు సరికదా, సూర్య చంద్రుల గమనాన్ని నిరోధించింది.వింధ్య పర్వతానికి అదుపు చేసేందుకు గాను తాను తిరిగి వచ్చేంతవరకు పెరగవద్దు అని అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని ఆదేశించాడు.
|
మామ్మలేశ్వరలో ప్రారంభమయ్యే ఓంకారేశ్వరుని ఊరేగింపు ఓంకారేశ్వర నగరం గుండా సాగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో జరిగే ఈ ఊరేగింపును చూడటానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు విచ్చేస్తారు. ఆ సమయంలో ఓంకారేశ్వర నగరంలోని వీధులన్నీ కూడా జనసందోహంతో క్రిక్కిరిసిపోతాయి.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
|
మరోవంక దేవుని అభిషేకించేందుకు పవిత్ర జలాలను తెచ్చే కవాడియాల నృత్య హేల మరియు భక్తి ప్రపత్తులతో వారు శంభోశంకరుని ప్రసన్నం చేసుకోవాలని సాగించే ప్రార్థనలు, ఇంకో వైపు ఆనందోత్సాహాలతో ఉరకలేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే యువత.
|
ఎలా వెళ్లాలి...
రోడ్డు ద్వారా: ఇండోర్ (77 కి.మీ), భోపాల్ (275 కి.మీ) మరియు ఖాండ్వా (77 కి.మీ) నగరాల నుంచి నేరుగా బస్సు మరియు టాక్సీ సౌకర్యాలు ఉన్నాయి.
రైలు ద్వారా: ఇండోర్ మరియు ఖాండ్వా నగరాలుకు ప్రత్యక్షంగా అనుసంధానమై సమీపాన గల ఓంకారేశ్వర్ రోడ్డు రైల్వే స్టేషన్ (12 కి.మీ).
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
