సంపూర్ణ నయనానందకరం కలిగించే రీతిలో అణువణువునా ఆధ్యాత్మకతను రంగరించుకున్న వాతావరణం సదాశివుని సమ్మోహనపరుస్తుంది. ఓంకారేశ్వరుని పంచముఖ వెండి ప్రతిమ భక్తుల జయజయధ్వానాల మధ్య 'కోటి తీర్థ్ ఘాట్'ను చేరుకుంటుంది. నగరంలోని వారందరూ దర్శనం చేసుకున్న అనంతరం నదీ ప్రయాణం సాగించేందుకు ప్రతిమలను పడవలో చేరుస్తారు. పూర్తి వాతావరణం శివమయంగా ద్యోతకమవుతుంది.
ఎలా వెళ్లాలి... రోడ్డు ద్వారా: ఇండోర్ (77 కి.మీ), భోపాల్ (275 కి.మీ) మరియు ఖాండ్వా (77 కి.మీ) నగరాల నుంచి నేరుగా బస్సు మరియు టాక్సీ సౌకర్యాలు ఉన్నాయి.
రైలు ద్వారా: ఇండోర్ మరియు ఖాండ్వా నగరాలుకు ప్రత్యక్షంగా అనుసంధానమై సమీపాన గల ఓంకారేశ్వర్ రోడ్డు రైల్వే స్టేషన్ (12 కి.మీ).
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
|