త్రయంబకేశ్వరుని దర్శించి.. తరించండి
|
|
ఆ ఆలయం యొక్క ప్రధాన భవనం ఇండో-ఆర్యన్ నాటి నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. గర్భగుడిలోకి ప్రవేశించిగానే, అక్కడ శివలింగానికి ఒకే ఆధారం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే శివలింగానికి మరింత చేరువై దగ్గరగా చూస్తే... ఆ ఆధారంలో అంగుళం సైజున్న మూడు చిన్నచిన్న శివలింగాలు గోచరిస్తాయి. ఆ మూడు శివలింగాలును బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులుగా భావిస్తారు. ఉదయకాలపు ప్రార్థన అవగానే, ఐదు ముఖాలతో కలిగి ఉన్న పంచముఖ వెండి కిరీటాన్ని పరమేశ్వరుడు ధరిస్తాడు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
|
|
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పురాణ గాథ ప్రకారం... పూర్వం, గౌతమ్ ఋషి కోరిక మేరకు త్రయంబక్ లో స్వామి వెలశాడని ప్రతీతి. వివరాలలోకి వెళితే.... గోవధ పాపపరిహారం నిమిత్తం, గౌతమి ఋషి శివుని గురించి బ్రహ్మాండమైన తపస్సు ఆచరించాడు. తన పాపపరిహారానికి గాను ఆ ప్రదేశంలో గంగను ప్రతిష్టించాల్సిందిగా కోరాడు. ఫలితంగా గోదావరి పుట్టింది. ఈ కారణంగానే గోదావరికి దక్షిణ గంగ అన్న పేరు సార్థమకమైనట్లు పురాణ కథనం.
|
|
ఈ మహోత్సవం శివరాత్రినాడు, శ్రావణ మాసంలో కన్నులపండువగా జరుగుతుంది. త్రయంబకేశ్వరంలో జరిగే ఈ ఉత్సవానికి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. కోనేటిలో పుణ్య స్నానాలు ఆచరించి పరమేశ్వరుని దర్శించుకుని తరిస్తారు. త్రయంబకేశ్వర్ ‘నారాయణ్ నాగ్ బలి’ అన్న ప్రత్యేక పూజలకు కూడా ప్రసిద్ధి గాంచినది. కాలసర్పయోగం ఉన్నవారికి ఇక్కడ నివారణ జరుగుతుంది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
