1. ఆధ్యాత్మికం
  2. »
  3. తీర్థయాత్ర
  4. »
  5. కథనాలు

నాగచంద్రేశ్వర ఆలయ దర్శనం.. సర్వ సర్ప దోష నివారణం

మహాకాళ దేవుని మహా నగరం.. ఉజ్జయిని. ఈ నగరానికి దేవాలయాల నగరంగా మరో పేరుంది.
సర్పాధిపతిగా పిలువబడే తక్షకుని విగ్రహాన్ని నాగపంచమి నాడు కొలిచేందుకు వేల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తారు. నాగరాజైన తక్షకుని కరుణా కటాక్ష వీక్షణాల కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తారు.

.

తాజా గణాంకాలను అనుసరించి నాగపంచమి నాడు 24 గంటల వ్యవధిలో రమారమిగా లక్ష నుంచి రెండు లక్షల మంది దాకా భక్తులు ఇక్కడ దైవదర్శన

సాధారణంగా మహావిష్ణువు సర్పతల్పంపై పరుండి కనిపిస్తాడు కానీ అందుకు భిన్నంగా ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని రీతిలో ఇక్కడి దేవాలయంలో బోళాశంకరుడు సర్పతల్పంపై పవ్వళించి ఉంటాడు. విగ్రహ రూపంలోని శంకర మహాదేవుడు భుజంపైన మరియు మెడ చుట్టూ సర్పాలను ధరించి ఉంటాడు. '

ఇతిహాసాల విశ్వాసం
ఇది చాలా పురాతనమైన దేవాలయం. పర్మర్ వంశానికి చెందిన భోజరాజు ఈ దేవాలయాన్ని 1050వ సంవత్సరంలో పునరుద్ధరించాడని ఒక విశ్వాసం. అనంతరం 1732వ సంవత్సరంలో, మహాకాళ దేవాలయంతో ఈ దేవాలయానికి రాణాజీ సింధియా నూత్న వైభవాన్ని తెచ్చారు.

ఈ దేవాలయంలో పూజలు చేసిన వారికి సర్వ సర్పదోషాలు తొలగిపోతాయని చెప్పబడింది. 'నాగపంచమి' నాడు లక్షలాదిగా భక్తులు ఈ దేవాలయాన్ని



ఎప్పుడు వెళ్ళాలి
మీరు ఈ దేవాలయాన్ని సందర్శించదలచినట్లయితే, నాగపంచమి నాడు మాత్రమే తెరిచి ఉండే దేవాలయానికి ఆనాడే వెళ్ళండి. మీరు ఉజ్జయినీని సందర్శిచదలచినట్లయితే, నాగపంచమి పండుగకు సమీప కాలాన్ని ఎంచుకోవడం ద్వారా సర్పాధిపతి తక్షకుని కూడా మీరు సేవించవచ్చు.

రోడ్డు మార్గం...
ఇండోర్ (55 కి.మీ.), భోపాల్ (200 కి.మీ.) మరియు ఖాండ్వా (175 కి.మీ.) లకు ఉజ్జయినీ నుంచి ఇరువైపులా రవాణా సౌకర్యం కలదు. ఈ నగరాల నుంచి బస్సులు మరియు ట్యాక్సీలను సులభంగా కనుగొనవచ్చు.

రైలు మార్గం...
ఉజ్జయినీకి రైలు మార్గం కలదు. ముంబాయి, ఢిల్లీ, భోపాల్, ఖాండ్వా మరియు ఇండోర్ నగరాల నుంచి ఇక్కడకు నేరుగా చేర్చే రైలు సౌకర్యం ఉంది.

విమాన మార్గం...
ఇండోర్‌లోని దేవీ అహల్యా విమానాశ్రయం (65 కి.మీ.) ఇక్కడకు సమీపంలో ఉంది.



ఎక్కడ బస చేయాలి?
మీ అవసరాలు మరియు ఆర్థిక స్తోమతను అనుసరించి ఉజ్జయినీలో 'ధర్మశాల' మరియు హోటళ్లు ఉన్నాయి. అంతేకాక మహాకాళ కమీటి మరియు హర్‌సిద్ధి కమిటీకి చెందిన ధర్మశాలలు అందుబాటులో ధరలకు ఇక్కడ లభిస్తాయి.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి