ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
శ్రీకృష్ణ నామామృతాన్ని బోధించే ఇస్కాన్ దేవాలయం
WD PhotoWD
న్యూయార్క్‌లో ప్రారంభమైన భక్తి తరంగాలు ప్రపంచం నలుమూలల వ్యాపిస్తున్నాయి. అనేక దేశాలలోని భక్తుల హృదయాలలో 'హరే రామ హరే కృష్ణ సంకీర్తన' ప్రతిధ్వనిస్తున్నది. ఇస్కాన్ సమక్షంలో భక్తులకు భక్తి భావనలతో కూడిన మానసిక ప్రశాంతత లభిస్తున్నది. 'భగవద్గీత'ను అనుసరించి శాంతియుత మార్గాన్ని భక్తులు కనుగొనడం ఇక్కడే జరుగుతున్నది. ఇస్కాన్ భక్తులు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు..

మాంసాహారంతో పాటు ఉల్లిపాయ, అల్లంతో చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి
మత్తు పదార్థాలు, జూదం మరియు అక్రమ లైంగిక సంబంధాలు నిషిద్ధం.
భగవద్గీత మరియ పురాణేతిహాసాల అధ్యయనాన్ని ప్రతిరోజు గంటసేపు చేయాలి.
ప్రతిరోజూ నిర్దేశిత సంఖ్యలో మంత్రాలను (హరే రామ హరే కృష్ణ) జపించాలి.

'తీర్థయాత్ర శ్రేణి'లో ఈ వారం ఉజ్జయినీలోని ఇస్కాన్ దేవాలయాన్ని పరిచయం చేస్తున్నాము. శ్రీకృష్ణుడు తన విద్యాభ్యాసాన్ని ఇక్కడే పూర్తి చేసాడు. అద్భుతమై
WD PhotoWD
ఈ దేవాలయం 2006వ సంవత్సరంలో నిర్మించబడింది. రాధాకృష్ణులు విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ఉండి భక్తిభావనను కలిగిస్తుంది. అలాగే ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాదదేవుల ఆకర్షణీయమైన విగ్రహం కూడా ఈ దేవాలయంలో కొలువై ఉన్నది. ప్రతి ఇస్కాన్ దేవాలయంలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడ తులసి వనం ఉన్నది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వనంలోని తులసి ఆకులతో శ్రీకృష్ణునికి మాలను కడతారు. ఈ దేవాలయానికి స్వంత అతిథి గృహం కలదు. ప్రపంచ వ్యాప్తంగా నిర్మితమైన ఇస్కాన్ అతిథి గృహాలలో రెండు లేదా మూడు రోజులపాటు వసతి సౌకర్యాన్ని కల్పిస్తారు. ఆ సమయంలో భక్తులకు కేవలం శాఖాహారాన్నిమాత్రమే అందిస్తారు. ఒకే రీతిన కనిపించే భవననిర్మాణం మరియు అంతర్గత పరిసరాలు ఇస్కాన్ దేవాలయాల ప్రత్యేకత. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ దేవాలయాలన్నింటిలోనూ అనిర్వచనీయమైన ఆప్యాయతను మీరు చవిచూడవచ్చు, అటువంటి వాతావరణమే పెద్దసంఖ్యలో భక్తులను శ్రీకృష్ణ భక్తి తత్వం వైపు ఆకర్షితులను చేస్తున్నది.
వీడియోను వీక్షించండి
 << 1 | 2   
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
నాగచంద్రేశ్వర ఆలయ దర్శనం.. సర్వ సర్ప దోష నివారణం
త్రయంబకేశ్వరుని దర్శించి.. తరించండి
నయనానందకరం ఓంకారేశ్వరుని ఉత్సవం
మంగళనాథుని దర్శనం.. దోష నివారణం
ఉజ్జయినిలోని 'మహాకాల్ ఆలయ' ప్రాశస్త్యం