"పంచామృత స్థాపన", "శ్రీలక్ష్మీగణపతి హోమం" మరియు "లక్ష కుంకుమార్చన" అనంతరం వేద మంత్రోచ్ఛారణల నడుమ నిత్యపూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భక్త జనులకు ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తూ శరన్నవరాత్రి, దీపావళి, తదితర ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి.
దశముఖ మహాకాళి: ఇక్కడి మహాకాళి పది ముఖాలు, పది పాదములను కలిగి గాఢమైన నీలివర్ణంలో దర్శనమిస్తుంది. ఆభరణ శోభితమై అలరారుతున్న అమ్మవారి అష్ట హస్తాలలో పలు రకములైన ఆయుధాలు, ఆభరణాలు కనిపిస్తాయి. ఖడ్గం, చక్రం, గద, విల్లు, బాణం, ఇనుప ఆయుధం, పొడవైన ఈటె, వడిసెల, శంఖం, మానవ శిరస్సులను మహాకాళి తన హస్తాలలో ధరించి కనిపించింది. తామస గుణానికి తార్కాణమైన దేవి, శ్రీమహావిష్ణువుకు యోగనిద్రను కలిగించింది. శ్రీమహావిష్ణువును విడువమని బ్రహ్మ దేవుడు వేడుకొనడంతో శ్రీ మహావిష్ణువు మధుకైటభులను సంహరించాడు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పద్దెనిమిది చేతుల మహాలక్ష్మి: రాజసిక తత్వంలో ద్వితీయ శక్తిగా మహాలక్ష్మి రాక్షసులను సంహరించేందుకు పగడాన్ని పోలిన ఎరుపు వర్ణాన్ని సంతరించుకున్నది. ఆమె తన 18 హస్తములలో జపమాల, సమర గొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం, తామర పువ్వు, విల్లు, నీటి కుండ, దుడ్డు కర్ర, పొడవైన ఈటె, ఖడ్గం, కవచం, శంఖం, గంట, జల పాత్ర, త్రిశూలము, ఉరి త్రాడు మరియు సుదర్శన చక్రధారియై భక్తులకు వరదాయినిగా నిలుస్తున్నది.
|