ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
పద్దెనిమిది చేతుల "మహాలక్ష్మీ శ్రీ కాళీమాత"
WD PhotoWD
దేవతలందరి శక్తి నుంచి ఉద్భవించిన శక్తిస్వరూపిణి, ఆహార్యంలో శక్తులను కనపరిచే మాత గానే కాక దుష్టశక్తులతో పోరాడే మహాలక్ష్మిగా సర్వలోకాలకు రక్షించే అభయమిస్తున్నది. కనుకనే ఆమె రుధిర వర్ణం మరియు సమర వర్ణమైన ఎరుపు రంగులో దర్శనమిస్తున్నది. మహిషాసురుని సంహరించిన మహాలక్ష్మి, మహిషాసుర మర్ధినిగా "శక్తి ఉపాసకుల"చే కొలవబడుతున్నది.

ఎనిమిది చేతుల సరస్వతి:
దేవి యొక్క స్వాతిక లక్షణాలకు ప్రతీకగా మూడవ దేవత అయిన మహా సరస్వతి నిలుస్తున్నది. శరత్కాలపు చంద్రుని పోలిన ఆమె తన ఎనిమిది చేతులలో గంట, త్రిశూలము, నాగలి, శంఖం, ముసలం, చక్రం, విల్లు, బాణాలను ధరించి భక్తజనులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడిస్తున్నది. భౌతిక పరిపూర్ణతకు, సౌందర్యానికి సరస్వతీ మాత తార్కాణంగా నిలుస్తున్నది. కార్య విధానం మరియు నిర్వహణకు తోడ్పాటునందించే శక్తిగా ఆమె పూజలందుకుంటున్నది.

ధూమ్రలోచన, చండ, ముండ, నిశుంభ, సుంబాసురులను లోకకళ్యాణార్థం మహా సరస్వతి సంహరించింది. ముగ్గురు మూర్తులకు మూల శక్తిగా "మహేశ్వరి లేదా "రాజరాజేశ్వరి" మరియు దక్షిణ భారతదేశాన శక్తి ఉపాసకులు కొలిచే "లలితా త్రిపుర సుందరి" భాసిస్తున్నది. లలితను సౌందర్యానికి అదిదేవతగా భక్తులు ఆరాధిస్తుంటారు. త్రిశక్తి పీఠాన్ని దర్శించి, ఆరాధించుకునే అపూర్వమైన అవకాశాన్ని వెబ్‌దునియా మీకు అందిస్తున్నది. శాశ్వత పరమానందాన్ని పొందేందుకు
WD PhotoWD
పూజించుకుందాం.


ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేరుకునే మార్గం:
విజయవాడ నగరానికి కీలకమైన ప్రాంతంలో కొలువైన ఈ దేవాలయానికి, రైల్వే స్టేషన్ నుంచి 10 నిమిషాలలో చేరుకోవచ్చు. విజయవాడ హైదరాబాద్ నగరానికి 275 కి.మీ.ల దూరంలో ఉన్నది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా విజయవాడకు చేరుకోవచ్చు.
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3   
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
డాకోర్‌లోని రంఛోడ్‌రాయ్‌జీ దేవాలయం  
శ్రీ హర్‌మందిర్ సాహిబ్, స్వర్ణదేవాలయం  
లక్నోలో హనుమంతునికి ప్రదర్శనశాల  
సంగీత చక్రవర్తి- బట్టుక్ భైరవ్  
సర్వశక్తి స్వరూపిణి కొల్లూర్ మూకాంబికాదేవి  
జై కనకదుర్గ.. జై జై కనకదుర్గ