పుణ్యక్షేత్రాలు
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » తీర్థయాత్ర » పుణ్యక్షేత్రాలు » సర్వపాపహరణం... కాశీ సందర్శనం
Feedback Print Bookmark and Share
 
WD PhotoWD
కాశీ దేవాలయం
గంగానదికి సమీపంలో విశ్వనాథ గల్లీగా పిలవబడే చిన్న వీధిలో చిన్న చిన్న దేవాలయాల సమూహంగా దేవాలయ ప్రాంగణం వర్థిల్లుతోంది. ప్రాంగణంలోని విశ్వనాథ దేవాలయం చుట్టు పక్కల అనేక అనుబంధితమైన పీఠాలు ఆవరించి ఉన్నాయి. 'జ్ఞాన వాపి' అనగా జ్ఞాన బావిగా పేరొందిన నుయ్యి ఒకటి ప్రధాన దేవాలయానికి ఉత్తర దిశలో నెలకొంది.

విశ్వనాథ దేవాలయం మంటపం మరియు గర్భగుడితో అలరారుతోంది. గర్భగుడిలో ప్రధానంగా పూజలందుకునే శివస్వరూపానికి తార్కాణంగా నిలుస్తున్న లింగం 60 సెం.మీ.ల పొడవు మరియు 90 సెం.మీ.ల చుట్టుకొలతతో వెండి తాపడాన్ని కలిగి ఉంటుంది. శివలింగం నల్లరాతితో నిర్మితమైంది. దేవాలయ అంతర్భాగం విశాలంగా లేకున్నప్పటికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి మహాశివుని పూజించుకునేందుకు భక్తులకు అనువుగా ఉంటోంది.

చరిత్ర
చరిత్ర పుట్టకముందు కాలం నుంచి దేవాలయం ఉన్నట్లుగా చెప్పబడింది. దేవాలయం ప్రాంగణంలోని భవన సముదాయాన్ని పునరుద్ధరించే నిమిత్తం 1776 సంవత్సరంలో అప్పటి ఇండోర్ సంస్థానపు మహారాణి అహల్యాబాయి భారీగా విరాళాలను అందించారు. దేవాలయ ఊర్థ్వభాగంలో 16 మీటర్ల ఎత్తైన కలశ గోపురాన్ని నిర్మించేందుకు లాహోర్ మహారాజు రంజిత్ సింగ్ 1000 కేజీల స్వర్ణాన్ని విరాళంగా ఇచ్చారని చెప్పబడింది. 1983 సంవత్సరంలో దేవాలయ నిర్వహణ బాధ్యతలను
WD PhotoWD
చేపట్టిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బెనారస్ పూర్వ పాలకుడు విభూతి సింగ్‌ను దేవాలయ ధర్మకర్తగా నియమించింది.


పూజకు వేళాయెనే...
ప్రతి రోజు తెల్లవారుఝామున గం 02.30 ని.లకు దేవాలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. ఉదయం మూడు నుంచి నాలుగు గంటల మధ్యకాలంలో జరిగే మంగళహారతికి టిక్కెట్లు కలిగిన భక్తులను అనుమతిస్తారు. అనంతరం ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాధారణ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం 11.30 నుంచి 12 గంటల మధ్య కాలంలో మధ్యాహ్న భోగ్ హారతిని ఇస్తారు. మరల మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు భక్తులు ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు.