గుడి మధ్యలో శివకామ సుందరీ సమేతుడైన పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ చిదంబరుని గురించిన రహస్యం ఒకటి మీరు తెలుసుకోవాలి. ఆ రహస్యమేమటని తెలుసుకోవాలనుకుంటే మీరు ఆలయ పూజారులకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వుంటుంది. ఎందుకంటే... భక్తులు ఇచ్చే కానుకల ద్వారానే ఆలయ నిర్వహణ జరుగుతోంది.
ఇది శైవ క్షేత్రం అయినప్పటికీ, మీరు ఇక్కడ గోవిందరాజుల సన్నిధిని చూడవచ్చు. ఇక్కడ మరో అద్భుతమైన విశేషమేమిటంటే... గోవిందరాజులు, పరమేశ్వరుడు ఒకేచోట నిలబడి వుండటం. ఇక్కడ అందమైన కొలనుతోపాటు భరతనాట్యం చేసేందుకు హాలు కూడా వుంది. ప్రతి ఏటా నాట్య ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు పాల్గొని తమ నాట్యాన్ని ప్రదర్శిస్తారు.
చిదంబరాన్ని చేరుకోవడం ఎలా: రైలు ద్వారా: చెన్నై రైల్వే స్టేషను నుంచి చిదంబరం (చెన్నై-తంజావూరు రైలు మార్గంలో) 245 కిలోమీటర్ల దూరంలో వుంది.
రోడ్డు ద్వారా: చెన్నై నుంచి నాలుగు లేదా 5 గంటల్లో బస్సు లేదా కారులో చిదంబరాన్ని చేరుకోవచ్చు.
విమానమార్గం: చెన్నై విమానశ్రయమే చిదంబరానికి సమీపంలో వున్న విమానాశ్రయం. ఇక్కడ నుంచి మీరు రైలు లేదా రోడ్డు మార్గంలో చిదంబరం ఆలయాన్ని చేరుకోవచ్చు. |