సీతామాత తన ప్రవాస జీవితంలో ఈ గుహలోనే బసచేసిందని భక్తుల విశ్వాసం. ఈ గుహ చుట్టూ అతి పెద్ద మర్రి చెట్లు ఊడలు దిగి ఉంటాయి. ఈ ఆలయం చూడ్డానికి త్రయంబకేశ్వరాలయంలా ఉంటుందని చెబుతారు. అంతేకాక దీనికి వితాల, గణేశ, హనుమాన్ దేవుళ్లను ప్రతిష్టించిన ఆలయాలు అనుబంధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో రామనవమి, దసరా, చైత్ర పాఢ్యమి (హిందూ నూతన సంవత్సరాది) పండుగలను పైభవంగా జరుపుతారు. ఈ సమయంలో కాళరామ్ మందిరం శ్రీరాముడి సందర్శనాభాగ్యానికి వచ్చే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. విశిష్ట పండుగలు:శ్రీరామనవమి, దసరా, చైత్ర పాఢ్యమి పర్వదినాలలో ఈ ఆలయంలో పెద్ద ఊరేగింపు, ఉత్సవాలు జరుపుతారు.గమ్యమార్గం:ముంబైకి 170 కిలోమీటర్ల దూరంలోను, పుణేకి 210 కిలోమీటర్ల దూరంలోనూ నాసిక్ ఉంటుంది. సెంట్రల్ రైల్వే మార్గంలో నాసిక్ ఒక ప్రధాన రైల్వే స్టేషన్.నాసిక్‌లో విమానాశ్రయం ఉంది. ఇది ముంబైతో అనుసంధానమై ఉంది. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |