ఆలయంలోని పూజారి కైలాష్ నారాయణ్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఆలయం అతిపురాతనమైనదని, ఆలయంలో కొలువైన అమ్మవారిని పదో తరం నుంచి పూజారులు కొలుస్తున్నట్టు చెప్పారు. ఆలయానికి తొలిసారి 1815 సంవత్సరంలో జీర్ణోద్ధారణ పనులు పూర్తి చేశారు. తమ కోర్కెలు, కష్టాలు తీరేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి యాగాలు, హోమాలు నిర్వహిస్తుంటారని తెలిపారు. ఆలయంలోని మిగిలిన పూజారులైన గోపాల్ పాండా, మనోహర్‌లాల్ పాండా తదితరులు మాట్లాడుతూ.. తాంత్రీకులు బాగ్లాముఖి దేవతను తమ ఆరాధ్య దేవతగా ఆరాధించేవారని తెలిపారు. తాంత్రీకులకు అత్యంత పుణ్యస్థలంగా ఈ ప్రాంతం పేరొందినట్టు చెప్పారు. ధర్మరాజు ఈ ఆలయాన్ని నిర్మించడం ఒక ప్రత్యేకతగాను, ఆలయంలోని బాగ్లాముఖి విగ్రహం స్వయంభుగా వెలవడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఎలా చేరుకోవాలి విమానమార్గం.. ఇండోర్ విమానాశ్రయానికి సమీపంలో నల్కేఢా ఆలయం వెలసివుంది. రైలు మార్గం.. ఉజ్జయనీ లేదా దేవాస్ రైల్వే స్టేషన్లలో దిగి అక్కడ నుంచి టాక్సీలలో ఆలయానికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గం.. ఇండోర్ బస్‌స్టేషన్ నుంచి బస్సులు లేదా టాక్సీలలో చేరుకోవచ్చు. ఇండోర్ నుంచి నల్కేఢా 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |