వన్డే సిరీస్: ఇంగ్లాండ్‌కు భారత్ కళ్లె వేసేనా..?
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం మాంచెస్టర్‌లో నాలుగో వన్డే జరుగనుంది. ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్యం ఇంగ్లాండ్ జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నాలుగో వన్డే భారత్‌కు అత్యంత కీలకం కానుంది. ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని నిలువరించి.. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే.. భారత్ ఈ మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించి తీరాల్సి ఉంది.
మూడో వన్డేలో ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ రంగాల్లో పూర్తిగా విఫలమైన భారత్.. నాలుగో వన్డేలో విజయం అంత సులభంగా దక్కేలా కనిపించడం లేదు. ముఖ్యంగా చెప్పుకోవసిన అంశం ఫీల్డింగ్. భారత్‌ను కలవరపరుస్తున్న అత్యంత కీలక సమస్య. ఫీల్డింగ్‌లో మనవాళ్లు కాస్త మెడలువంచితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రాణిస్తే విజయ లక్ష్మి వరిస్తుంది.
ఇదిలావుండగా.. అస్వస్థతతో బాధపడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ కాలింగ్‌వుడ్ ఈ మ్యాచ్‌లో ఆడటం అనుమానాస్పదంగా కనిపిస్తుంది. బుధవారం నాడు జరిగిన ప్రాక్టీస్‌కు కూడా అతడు హాజరు కాలేదు. వుడ్ లేని పక్షంలో ఆల్ రౌండర్ ఫింట్లాఫ్ జట్టుకు సారధ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. భారత జట్టులో మార్పులేమి ఉండక పోవచ్చు.