శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2016 (17:52 IST)

మెరిసే శిరోజాల కోసం.. ఈ టిప్స్ పాటించండి.. జుట్టు తెల్లబడుతుంటే?

జుట్టు తెల్లబడుతోందా? కురుల సంరక్షణ కోసం భారీ ధర పలికే ఉత్పత్తులు వాడుతున్నారా? అయితే వాటిని పక్కనబెట్టండి. చిన్నతనంలో జుట్టు తెల్లబడితే.. మనం తీసుకునే ఆహారంతోపాటు కొన్ని సహజ ఉత్పత్తులతో కూడిన చిట్కా

జుట్టు తెల్లబడుతోందా? కురుల సంరక్షణ కోసం భారీ ధర పలికే ఉత్పత్తులు వాడుతున్నారా? అయితే వాటిని పక్కనబెట్టండి. చిన్నతనంలో జుట్టు తెల్లబడితే..  మనం తీసుకునే ఆహారంతోపాటు కొన్ని సహజ ఉత్పత్తులతో కూడిన చిట్కాలను కూడా పాటిస్తే పట్టులాంటి కురులు సొంతమవుతాయి. 
 
ఎండు ఉసిరి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకొని ఓ పాత్రలోకి తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
 
అలాగే ఒక కప్పు ఎండు ఉసిరిని నాలుగు కప్పుల నీళ్లల్లో వేసి చిటికెడు పంచదార కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం ఒక కప్పు మోతాదుకు వచ్చిన తర్వాత ఇందులో రెండు కప్పుల హెన్నాపొడి, గుడ్డుసొన, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమం పేస్టులా తయారయ్యాక తలకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.