గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2016 (10:30 IST)

వాకింగ్ చేయడం బద్ధకంగా ఉందా.. ప్రమాదం పొంచివున్నట్టే...

చాలా మందికి ఉదయం వేళ వాకింగ్ చేయడం చాలా బద్ధకంగా ఉంటుంది. ముఖ్యంగా.. పురుషుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే చిన్న పనికి కూడా ద్విచక్ర వాహనంపై రయ్‌న్ వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారుకి ప్రమాదం పొంచివున్నట్టేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా.. ఉద్యోగులు, గృహిణులు, యువత సైతం ఈ కాలంలో కూర్చోడానికి, విశ్రాంతికోసం ఇంటికి పరిమితం కావడానికి ఇస్తున్న ప్రాధాన్యత నడవడానికి ఇవ్వడం లేదు. ఇంటినుంచి ఆఫీసుకు, తిరిగి ఇంటికి మనిషిని చేర్చటంలో సొంత వాహనాలు మంచి వెసులుబాటును ఇచ్చినప్పటికీ ఈ క్రమంలో నడక గాలికెగిరిపోయి సమస్యలను కోరి ఆహ్వానించినట్టవుతోంది.
 
ఇంటి నుంచి ఆఫీసుకు పోయాక కుర్చీల్లో కూర్చుని గంటల కొద్దీ పనిచేయటం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా టివి చూడటం, తినటం, చదువుకోవటం, కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పటంతోనే కాలం వెళ్లబుచ్చటం వల్ల కండరాలు బిగుసుకుపోవటం అనేది సహజమైపోయింది. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమంటున్నారు.