శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 18 మే 2016 (16:42 IST)

ముఖంపై మురికికి పెరుగు ప్యాక్‌తో మటుమాయం!

వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది బయటకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ముఖం నల్లబడిపోతుందని బయపడుతుంటారు. ఈ కాలంలో ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం తప్పనిసరిగా పాటించాలి. 

పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతంగా మారుతుంది.
 
ఈ సమ్మర్‌లో ఎండ వల్ల చెమట వస్తుంది. దీని వల్ల ముఖం కమిలి పోవడం, ముఖం మండటం జరుగుతుంది. అలాంటప్పుడు పెరుగును ముఖానికి రాసుకుంటే చల్లగా ఉండటమేకాకుండా అందులో ఉండే జింక్ ముఖంలో పేరుకుపోయిన మురికిని పోగొడుతుంది. 
 
ఎండ వల్ల ముఖంలో తేమ తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ పొడిబారినట్టు కనిపిస్తుంది. అటువంటి సమయంలో పెరుగును ముఖానికి రాసి చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. పెరుగులో పెసరపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది.