బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2017 (10:59 IST)

వేసవిలో క్యాలీఫ్లవర్ తీసుకోండి.. ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోండి

నట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన వేడి తగ్గకుండా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరం వంటివి రావు. అలాగే వేసవిలో అజీర్తితో బాధపడేవారు పెరుగు, మజ్జిగను అధికంగా తీసుకోవాలి. పేగులను

నట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన వేడి తగ్గకుండా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరం వంటివి రావు. అలాగే వేసవిలో అజీర్తితో బాధపడేవారు పెరుగు, మజ్జిగను అధికంగా తీసుకోవాలి. పేగులను శుభ్రపరిచి వ్యర్థాలను బయటకు పంపే శక్తి పెరుగుకు ఉంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరూ మెరుగుపడుతుంది. 
 
అలాగే గొంతు సంబంధిత సమస్యలతో బాధపడేవారు దీన్ని తరచుగా తీసుకుంటే మంచిది. దీనిలోని పోషకాలు పొట్టని కూడా శుభ్రం చేస్తాయి. రోజూ ఓ చెంచా తేనె ఇస్తే చిన్నారులకు తరచూ జలుబు చేయదు. వేసవిలో ఇంకా క్యాలీఫ్లవర్‌ను తీసుకోవాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికం. శరీరానికి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. 
 
ఇక మాంసాహారంలో చికెన్ కంటే వేసవిలో మటన్, చేపలను తీసుకోవాలి. ఇవి శరీరానికి సరిపడా ఇనుమూ, మాంసకృత్తులను అందిస్తాయి. పైగా వీటిలోని పోషకాలు తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌లను దూరం చేస్తాయి. చేపల్లోని ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు అధికం. ఇవి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు చేపలకి ప్రాధాన్యమిస్తే సమస్య త్వరగా తగ్గుతుంది.