గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 17 జూన్ 2017 (12:32 IST)

పనులతో చిరాగ్గా ఉన్నారా? కాసేపు నడవండి.. రోజుకు 20 నిమిషాలు.. వారానికి ఐదు రోజులు..

పనులతో అలసిపోయి చిరాగ్గా ఉన్నారా.. ఎవరితోనూ మాట్లాకుండా మౌనంగా ఉండిపోవడం, పడుకోవడం దీనికి పరిష్కారం కాదు. హాయిగా కాసేపు నడిచి చూడండి. ఉపశమనంగా అనిపిస్తుంది. నిద్రలేచీ లేవగానే చాలామంది మహిళలు వంటింట్లో

పనులతో అలసిపోయి చిరాగ్గా ఉన్నారా.. ఎవరితోనూ మాట్లాకుండా మౌనంగా ఉండిపోవడం, పడుకోవడం దీనికి పరిష్కారం కాదు. హాయిగా కాసేపు నడిచి చూడండి. ఉపశమనంగా అనిపిస్తుంది. నిద్రలేచీ లేవగానే చాలామంది మహిళలు వంటింట్లోకి పరుగు తీస్తుంటారు. అలా కాకుండా లేవగానే కాసేపు ధ్యానానికీ, వ్యాయామానికీ సమయం పెట్టుకోండి. బద్ధకం వదిలిపోవడమే కాదు, రోజంతా మెదడూ చురుగ్గా ఉంటుంది. అలసట ఉండదు. విసుగూ రాదు.
 
పక్కాగా ప్రణాళిక లేకుండా పనులు చేయడం వల్ల కాస్త గందరగోళం సహజమే. అలా కాకుండా రేపు చేయాల్సిన పనులేంటో ముందే ఆలోచించుకోండి. ఉదయం పూట కంగారు ఉండదు. ఒత్తిడిగానూ అనిపించదు. ఇలా ప్రణాళిక ఉండటం వల్ల ఉద్యోగినులకు పనిచేసే చోట ఉత్పాదకతా పెరుగుతుంది. రోజూ ఇరవై నిమిషాల నుంచి అరగంట చొప్పున వారంలో ఐదు రోజులు.. నడవడం అలవాటుగా మార్చుకోండి. అలాగే దగ్గరిదగ్గరి పనులకు స్కూటీనో, ఆటోనో ఎక్కకుండా నడకకే ప్రాధాన్యం ఇచ్చి చూడండి. సన్నబడటమే కాదు.. గుండెకూ మంచిది.
 
మెట్లు ఎక్కిదిగడం కూడా మంచి వ్యాయామమే. దీనివల్ల నడుము దిగువ భాగానికి తగిన శ్రమ అందుతుంది. ఇంట్లో కూడా చిన్నచిన్న స్ట్రెచింగ్‌, వ్యాయామాలూ, పుషప్‌లు ప్రయత్నించండి. ఇవి బరువును అదుపులో ఉంచడమే కాదు, కండరాలకూ ఎంతో మేలుచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.