బరువు తగ్గాలనుకునేవారు.. నూనెల్ని బాగా తగ్గించి.. పండ్లు, కూరగాయలు తీసుకోండి..

మంగళవారం, 27 జూన్ 2017 (10:37 IST)

food

బరువు తగ్గాలనుకునే వారు అన్నం మానేయడం కాదు.. నూనెలు, చక్కెర్లు మానేస్తేనే ఫలితం ఉంటుంది. వీటివల్లే మన శరీరానికి అవసరమైన కొవ్వులు అందుతాయనే మాట నిజం. అన్నం ద్వారా లభించే కార్బోహైడ్రేట్లనే మానేసి వూరుకుంటే సరిపోదు. కార్బొహైడ్రైట్‌ అధికంగా ఉండే కాయగూరలూ, పండ్లూ, ధాన్యాలూ కూడా పోషకాహారంలో భాగమేనని గుర్తుంచుకోవాలి.
 
బరువు తగ్గాలన్న తాపత్రయంలో అల్పాహారం, భోజనం మానేయడం వల్ల రోజంతా ఆకలితో ఉంటారు. ఫలితంగా ఒక్కసారిగా అధికంగా తినేస్తారు. లేదంటే చిరాకు, అసహనం వంటివీ ఎదురవుతాయి. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. క్రమంగా మీ జీవక్రియ రేటు పడిపోతుంది. అందుకే వీలైతే ఒక భోజనాన్ని ఒకేసారి తినడం కంటే మూడు సార్లు తినడం మంచిది. 
 
పీనట్‌ బటర్‌, చీజ్‌ తురుములను రోజుకి స్పూన్‌లో తీసుకోవడం మంచిది. వయసూ, బరువుని బట్టే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆరోగ్యవంతమైన మహిళ సగటున రోజుకి 60 గ్రాములు పప్పూ, 50 గ్రాముల వరకూ మాంసం తీసుకోవచ్చు. అన్నం, రాగులూ, జొన్నలూ, పాస్తా ఏవి తిన్నా సరే రోజుకి 270గ్రా నుంచి మూడొందల గ్రాములు మించకుండా తీసుకోవాలి. నూనెల్ని బాగా తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

చేతులు కడుక్కుంటే చాలు ఐడియాలు అమాంతంగా పుట్టుకొస్తాయట.. నిజమేనా?

తినేముందు చేతులు ఎందుకు కడుక్కోవాలి శుభ్రంగా ఉండడానికి.. చేతులపై ఉండే క్రిములు ...

news

బరువు తగ్గాలనుకునేవారు ఈ చిట్కాలు పాటిస్తే సరి...

* ప్రతి రోజు నడకను అలవాటు చేసుకోండి. ఇంటి బయట, షాపింగ్‌కు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళండి. ...

news

తిన్నది జీర్ణం కాక సతమతం... వాంతి చేసుకోవాల్సిందే... కానీ ఎలా?

పసుపు పరమౌషధంగా వుపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది ఎదుర్కొంటుంది. కొన్నిటిని ఎలా ...

news

మొబైల్‌ ఫోనుతో 'టెక్ నెక్' సమస్య ... ఇవి కూడా వచ్చేస్తాయ్...

ఏ వస్తువునైనా... ఆఖరికి శరీరాన్నయినా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మితిమీరి వాడితే తేడా ...