నన్నామె తదేకంగా చూస్తోంది... అందుకేనా...?

హైదరాబాదులో నలుగురు స్నేహితులతో కలిసి ఓ అపార్టుమెంట్లో ఉంటూ చదువుతున్నాను. నా వయసు 23 ఏళ్లు. మా పక్క అపార్టుమెంట్లో పెళ్లయిన జంట ఉంది. అతడు ఉదయం 10 గంటలకు ఆఫీసుకెళ్లిపోతాడు. ఇంట్లో అతడి భార్య ఒక్కతే ఉంటుంది. ఆమెకు సుమారు 20 ఏళ్లు ఉంటాయేమో. ఈమధ్య నన్న

Romance, couple
ivr| Last Modified బుధవారం, 29 మార్చి 2017 (22:14 IST)
హైదరాబాదులో నలుగురు స్నేహితులతో కలిసి ఓ అపార్టుమెంట్లో ఉంటూ చదువుతున్నాను. నా వయసు 23 ఏళ్లు. మా పక్క అపార్టుమెంట్లో పెళ్లయిన జంట ఉంది. అతడు ఉదయం 10 గంటలకు ఆఫీసుకెళ్లిపోతాడు. ఇంట్లో అతడి భార్య ఒక్కతే ఉంటుంది. ఆమెకు సుమారు 20 ఏళ్లు ఉంటాయేమో. ఈమధ్య నన్ను అదేపనిగా చూస్తోంది. మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు.

ఆ తర్వాత నేను కూడా ఆమెను చూస్తున్నాను. ఇలా గత నెల రోజులుగా జరుగుతూ ఉంది. ఆమె నన్ను చూడటం తప్పించి ఎలాంటి సంకేతాలు ఇవ్వడంలేదు. కనీసం నవ్వను కూడా నవ్వడంలేదు. ఐతే చూస్తూ ఉంటోంది. ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియడంలేదు. నాకు మాత్రం ఈమధ్య ఆమెను చూస్తుంటే సెక్స్ కోర్కెలు కలుగుతున్నాయి. ఆమె ఉద్దేశ్యం కూడా అదే అయి ఉంటుందా...

ఆమె చూసినంత మాత్రానే సెక్స్ కావాలనుకుంటున్నట్లు ఎందుకు అనుకుంటున్నారు. ఆమె అలా చూడటానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. మీలో తమ కుటుంబ సభ్యులు ఎవరైనా కనబడుతూ ఉండవచ్చు. ఇంకా ఇలాంటి కారణాలు చాలానే ఉంటాయి. ఐతే మీరు మాత్రం ఆమెను సెక్స్ దృష్టితో తప్ప మరే దృష్టితోనూ చూడటంలేదని తెలుస్తోంది. ఆమె చూపుకు మీరనుకున్న అర్థం అయి ఉండకపోవచ్చు. ఐనా ఆమెకు పెళ్లయి సంతోషంగా భర్తతో కాపురం చేసుకుంటోంది. ఆమె గురించి ఆలోచించడం మానేయండి. బుద్ధిగా చదువుకోండి.


దీనిపై మరింత చదవండి :