శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By TJ
Last Modified: శనివారం, 10 జూన్ 2017 (19:18 IST)

కాళ్ళ పగుళ్ళు పోవాలంటే చాలా సింపుల్...

సాధారణంగా కాళ్ళు పగలడానికి ముఖ్య కారణం కాళ్ళను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం. శరీరంలో అవసరమైన నీళ్ళు లేకపోయినా డీహైడ్రేషన్‌తో పాదాలు పగలడం, పెదాలు పగలడం, చర్మం పొడిబారే సమస్యలు ఏర్పడతాయి. అయితే పాదాల పగుళ్ళను వాటి నొప్పిని త్వరగా తగ్గించాలంటే ఈ సింపుల్

సాధారణంగా కాళ్ళు పగలడానికి ముఖ్య కారణం కాళ్ళను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం. శరీరంలో అవసరమైన నీళ్ళు లేకపోయినా డీహైడ్రేషన్‌తో పాదాలు పగలడం, పెదాలు పగలడం, చర్మం పొడిబారే సమస్యలు ఏర్పడతాయి. అయితే పాదాల పగుళ్ళను వాటి నొప్పిని త్వరగా తగ్గించాలంటే ఈ సింపుల్ చిట్కాను పాటించండి.
 
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి పాదాలను అందులో పెట్టాలి. ఇలా పది లేకుంటే 15నిమిషాలు కాళ్ళు అందులో పెట్టి కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉన్న డెడ్ సెల్ త్వరగా తొలగిపోతాయి. కాళ్ళను బయటకు తీసినప్పుడు తడి లేకుండా ఒక క్లాత్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఆ తరువాత గిన్నెలో ఒక టీస్పూన్ వాసలిన్, అందులో ఒక టీస్పేన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఒక మ్యాజికల్ క్రీమ్ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని పాదాలపై మర్దనా చేసి చర్మానికి పట్టేలా చేయాలి. ఆ తరువాత సాక్స్ వేసుకుని పడుకోవాలి.
 
వాసలిన్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి కాళ్ళ పగుళ్ళను తగ్గించి చర్మాన్ని డ్రైగా మారకుండా కాపాడుతుంది. నిమ్మరసంలోని పోషకాలు కాళ్ళ పగుళ్ళను తగ్గించడమే కాకుండా డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేసి చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుతుంది. ఈ మిశ్రమాన్ని కాళ్ళకు పూసిన మొదటిరోజే మీకు పగుళ్ళ నొప్పులు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తుంది. 
 
నాలుగు రోజుల పాటు ఇలా చెయ్యాలి. ఒకసారి తయారుచేసుకున్న మిశ్రమాన్ని పదిరోజుల వరకు వాడుకోవచ్చు. అలాగే కాళ్ళ పగుళ్ళతో బాధపడేవారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే కాళ్ళ పగుళ్ళ సమస్య దరిచేరకుండా ఉంటుంది. అలాగే కాళ్ళను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.