శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 5 జూన్ 2017 (16:06 IST)

గాఢ నిద్ర కావాలా.. ఇది చేస్తే గ్యారంటీ...?

మన పెద్దవారు పడుకోగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. కానీ మనకు మామూలు నిద్ర కూడా రావడం లేదు. దానికి ఎన్నో కారణాలు. నిద్రపోకుంటే లేనిపోని రోగాలు ఖాయమంటున్నారు వైద్యులు. పెద్దవారికి 6 నుంచి 8 గంటల నిద్ర, చిన్న పిల్లలకు ఇంకా ఎక్కువ. నిద్రలేమితో బాధపడేవ

మన పెద్దవారు పడుకోగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. కానీ మనకు మామూలు నిద్ర కూడా రావడం లేదు. దానికి ఎన్నో కారణాలు. నిద్రపోకుంటే లేనిపోని రోగాలు ఖాయమంటున్నారు వైద్యులు. పెద్దవారికి 6 నుంచి 8 గంటల నిద్ర, చిన్న పిల్లలకు ఇంకా ఎక్కువ. నిద్రలేమితో బాధపడేవారి  బాధ వర్ణనాతీతం. వారు నిద్రరావడం కోసం మద్యం సేవించడం, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడం చేస్తుంటారు. ఆర్టీఫీసియల్‌గా రప్పించే విధానం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే సహజంగా నిద్ర రప్పించే మందు ఒకటి ఉంది. అదే అరటిపండు.
 
అరటిపండులో మెగ్నీషియం అనే మినరల్ ఉంది. మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. అందువల్ల పెయిన్స్ తగ్గించి నిద్రవచ్చేలా చేస్తుంది. అరటిపండులో పొటాషియం ఉండే మినరల్ అధిక మోతాదులో ఉంటుంది. మజిల్స్‌ను రిలాక్స్ చేయడంతో పాటు ఈ పొటాషియం గాఢ నిద్రదశలో ఎక్కువ సేపు ఉండడానికి సహాయపడుతుంది. నిద్రలో ఐదు దశలు ఉంటుంది. 
 
నిద్రలో ఒకటి రెండు తేలికపాటి దశలు, మూడు, నాలుగు గాఢనిద్ర, ఐదవ దశ ర్యాపిడ్ ఐ మూమెంట్ దశ. నిద్రలో గాఢమైన దశ, నాలుగు, ఐదు మంచిది. అరటిపండు గాఢనిద్రలోకి వెళ్ళడానికి సహాయపడుతుంది. నిద్రపోవడానికి పదినిమిషాల ముందు అరటిపండు తినాలి.