బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (14:03 IST)

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..!

గుండె ఆరోగ్యంగా ఉండాలా..? అయితే ఈ టిప్స్ ఫాలోకండి. గుండె నొప్పులు పెరుగుతున్నాయి. శారీరక వ్యాయామం లోపించిన సుఖమయ జీవితం గుండె సమస్యలను పెంచుతోంది. 
 
ఆహారం అధికంగా తీసుకుంటూ, సిగరెట్ తాగే అలవాటు, మత్తుపానీయ సేవనం. దినవారి జీవనవిధానంలో ఒత్తిడి వల్లనే గుండె జబ్బులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కనీసం రోజుకు అరగంట పాటు నడక, సైక్లింగ్, ఈత వంటి వాటికి సమయం కేటాయించాలి. 
 
వాహన వాడకం తగ్గించడం, మెట్లు ఎక్కడం.. దిగడం చేయాలి. దురలవాట్లు అయిన సిగరెట్, డ్రింక్స్ తీసుకోకూడదు. యోగా చేయాలి. వేపుడులు తగ్గించండి. తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.