ఆరోగ్యానికి చిట్కాలు... తప్పక తెలుసుకోవాల్సినవి....

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (21:57 IST)

Tulsi

కూరగాయలు తరిగేటప్పుడు చేతులు తెగటం దాదాపుగా అందరికీ జరుగుతుంది. తెగిన వెంటనే గాయానికి పసుపు అద్దితే గాయం త్వరగా మానుతుంది. సెప్టిక్ కాదు. కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు మాయమవుతాయి.
 
కొందరికి కళ్ల చుట్టూ ముడతలు వస్తుంటాయి. బహుశా కళ్ల సమస్య ఉండి కూడా రావచ్చు. కనుక డాక్టరు సూచించిన మేరకు రీడింగ్‌ గ్లాసు వాడకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. డాక్టరు సలహాను అనుసరించి కళ్లను అధిక శ్రమకు గురిచేయకుండా జాగ్రత్త తీసుకోవాలి.
 
క్రమం తప్పకుండా ధనియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది. క్రమం తప్పకుండా సోయాబీన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను కరిగించి వేస్తుంది.
 
గర్భిణీలకు ఉదయాన్నే కాని, మరికొందరిలో ఏం తిన్నా కూడా వెంటనే వాంతులవడాన్ని చూస్తుంటాం. పరగడుపున ఒక టేబుల్‌ స్పూను తేనెలో అంతే మోతాదు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. తిన్నది కడుపులో ఇముడుతుంది. 
 
గాయాల నుంచి రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి. గజ్జి, తామర వంటివి బాధిస్తుంటే ఒక టీ స్పూను మిరియాల పొడిలో ఒక టీ స్పూను నెయ్యి కలిపి రోజుకి మూడుసార్లు చొప్పున తీసుకుంటే తగ్గిపోతుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

సెల్ ఫోన్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు.. ఒకే ఫోన్‌ను వాడొద్దు.. 80శాతం అక్కడే?

ఆస్పత్రులకు వెళ్తున్నారా? ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండాలంటే సెల్ ఫోన్లను తీసుకెళ్లకండి. ఇది ...

news

స్వైన్ ఫ్లూ లక్షణాలేంటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలుగు రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు ...

news

రాత్రి పడుకునే ముందు పచ్చకర్పూరం గుళిక ఒకటి మింగితే...

కర్పూరాల్లో రకాలున్నాయి. పచ్చకర్పూరం తెల్లకర్పూరంకన్నా చాలామంచిది. ఇది పలుకులుగా దుకాణంలో ...

news

అలోవెరా జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోండి.. స్లిమ్‌గా మారండి

అలోవెరా జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని.. శరీరాకృతిని ...