గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By Selvi
Last Updated : గురువారం, 10 జులై 2014 (19:06 IST)

"కోకోనట్ సమోసా" టేస్ట్ చేయండి.

ఒబిసిటీని దూరం చేసే కొబ్బరితో వెరైటీగా సమోసా ట్రై చేయండి. కొబ్బరి నూనెతో వంటకాల తయారీ ద్వారా ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చు. యాంటీ ఫంగల్‌గా పనిచేసే కొబ్బరితో వర్షాకాలంలో వేడి వేడి సమోసాలు చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.  
 
కావలసిన పదార్థాలు :
మైదా పిండి.. నాలుగు కప్పులు
నెయ్యి... నాలుగు టీ.
వాము.. రెండు టీ.
ఉప్పు, నూనె.. తగినంత
 
సమోసాల్లో నింపేందుకు..
కొబ్బరితురుము, నువ్వులు.. ఒక్కో కప్పు చొప్పున
కారం, ధనియాలపొడి, సోంపు.. తలా రెండు టీ.
ఇంగువ.. అర టీ.
ఉప్పు.. తగినంత
 
తయారీ విధానం :
ముందుగా మైదా పిండికి వాము, తగినంత ఉప్పు చేర్చి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు నానబెట్టాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేడిచేసి కొబ్బరి తురుము, నువ్వులను విడి విడిగా వేయించి ఉంచాలి. నువ్వులు చల్లారిన తరువాత పొడిచేసి ఉంచాలి. ఇప్పుడు నువ్వులపొడి, కొబ్బరి తురుము, సోంపు, వాము, ధనియాలపొడి, ఇంగువ, కారంపొడిలను ఒక పాత్రలో వేసి బాగా కలియబెట్టాలి. మైదాను చిన్న చిన్న పూరీల్లా చేసి చాకుతో రెండు భాగాలుగా కోయాలి.
 
ఒక్కోదాంట్లో పై పొడి మిశ్రమాన్ని మూడు టీస్పూన్లు వేసి నీటితో తడుపుతూ చివర్లు సమోసా షేప్‌లో మూసివేయాలి. అలా మొత్తం పిండినంతా చేసుకుని బాగా మరుగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి న్యూస్‌ పేపర్‌పై పరవాలి. అంతే వేడి వేడి కొబ్బరి సమోసాలు తయార్. వీటిని వేడిగా ఉన్నప్పుడే టొమోటో సాస్ లేదా చింతపండు సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కూడా.