గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: గురువారం, 29 డిశెంబరు 2016 (21:44 IST)

2017లో కుంభరాశి వారి రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి....

కుంభ రాశి వారికి ఆగష్టు వరకు జన్మము నందు కేతువు, సప్తము నందు రాహువు, ఆ తదుపరి అంతా షష్ఠమము నందు రాహువు, వ్యయము నందు కేతువు, సెప్టెంబరు 12వ తేదీ వరకు అష్టమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా భాగ్యము నందు జూన్ వరకు లాభము నందు శని, ఆ తదుపరి వక్ర గతిని అక్టో

కుంభరాశి: ధనిష్ట 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పా, 
ఆదాయం 11, వ్యయం 5, పూజ్యత 2, అవమానం 6
 
కుంభ రాశి వారికి ఆగష్టు వరకు జన్మము నందు కేతువు, సప్తము నందు రాహువు, ఆ తదుపరి అంతా షష్ఠమము నందు రాహువు, వ్యయము నందు కేతువు, సెప్టెంబరు 12వ తేదీ వరకు అష్టమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా భాగ్యము నందు జూన్ వరకు లాభము నందు శని, ఆ తదుపరి వక్ర గతిని అక్టోబరు వరకు రాజ్యము నందు, ఆ తదుపరి అంతా లాభము నందు సంచరిస్తాడు.
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా "జిహ్వగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్ర బాంధవా" అన్నట్లుగా మీ మంచి మాట, తీరు వల్ల ఎదుటివారిని తేలికగా ఆకట్టుకోగలుగుతారు. ప్రతి వ్యవహారం ఒకటి రెండుసార్లు ఆలోచించి మందుకుసాగిన మంచిది. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. ఆదాయవృద్ధి కావడంతో పెట్టుబడులు, పొదువు పథకాలపై దృష్టిసారిస్తారు. 
 
వివాహాది శుభకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీకంటూ ఒక గుర్తింపు రాణింపు లభిస్తుంది. రావలసిన ధనం విషయంలో అప్రమత్తత అవసరం. చేతికందినట్టే అంది చేజారి పోతుంటాయి. ప్రైవేటు రంగాల్లో వారికి ఒత్తిడి అధికం అవుతుంది. అధికారులతో ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాల్లో వారికి కలిసిరాగలదు. పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. కోరికలు, అవరాలు తీరగలవు. సన్నిహితులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. పెద్దలకు వీడ్కోలు పలుకుతారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత మినహా గుర్తింపు ఉండదు. సహోద్యోగులతో జాగ్రత్త అవసరం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఎవరినీ నిందించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు పదోన్నతికై చేయుయత్నాలు కలిసిరాగలవు. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థుల నుండి వ్యతిరేకత అధికమవుతుంది. వ్యవసాయ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. మీ సంతానం విషయాల్లో పురోభివృద్ధి కానవస్తుంది. కంది, మిర్చి, నూనె స్టాకిస్టులకు చిన్నతరహా రంగాల్లో వారికి శుభదాయకం. నిర్మాణ రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిర, చరాస్తుల వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. నిరుద్యోగయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రయాణాల్లో వ్యయప్రయాసలు ఎదుర్కొనక తప్పదు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. కళా, క్రీడా రంగాల్లో వారికి పురోభివృద్ధి. అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి చివరికి జయం మీదే అవుతుంది. పండితులకు, పురోహితులకు గౌరవపదవులు పొందే ఆస్కారం ఉంది. 
 
ఈ రాశివారికి "రాజరాజేశ్వరి అష్టకం" చదివినా లేక విన్నా సర్వదోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజూ 'కనకధారా' స్త్రోత్రం చదవటం వల్ల ఆరోగ్యాభివృద్ధి. సంకల్పసిద్ధి. మనోసిద్ధి చేకూరుతుంది. 
 
ధనిష్ట నక్షత్రం వారికి 'తెల్లపగడం', శతిభిషా నక్షత్రం వారికి 'గోమేధికం', పూర్వాభాద్ర నక్షత్రం వారికి 'వైక్రాంతమణి' లేక 'పుష్యరాగం' ధరించిన శుభం కలుగుతుంది.  
 
ధనిష్ట నక్షత్రం వారు 'జమ్మి', శతభిషా నక్షత్రం వారు 'అరటి', పూర్వాభాద్ర నక్షత్రం వారు 'మామిడి' చెట్టును దేవాలయాల్లో నాటిన సర్వదా శుభం కలుగుతుంది.