శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : ఆదివారం, 11 జూన్ 2017 (17:37 IST)

12-06-17 రాశిఫలాలు : స్వయంకృషితో అత్యున్నత స్థానం

వ్యాపారస్తులు అప్పులు ఇవ్వకపోవడం చాలా మంచిదని గమనించండి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. రాజకీయ నాయకులు తరచూ సభలుసమావేశాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. దూరప్రదేశాలను సందర్శిస్త

మేషం
వ్యాపారస్తులు అప్పులు ఇవ్వకపోవడం చాలా మంచిదని గమనించండి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. రాజకీయ నాయకులు తరచూ సభలుసమావేశాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. దూరప్రదేశాలను సందర్శిస్తారు. స్వయంకృషితో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. 
 
వృషభం
వృత్తి, ఉద్యోగాలలో సాధించిన విజయాలు మంచి గుర్తింపును తెచ్చిపెడతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో సమస్యలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
మిథునం 
సహాయం కోసం ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అధిక ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు ఇరుగుపొరుగు వారి నుంచి సమస్యలు తలెత్తుతాయి. కళాకారులు ఒత్తిడి, చికాకులు వంటివి అధికంగా ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం
గతంలో నిలిచిపోయిన మొండిబాకీలు విశ్వప్రయత్నం చేసి వసూలు చేయగలుగుతారు. డాక్టర్లు ఆపరేషన్లను విజవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
సింహం
ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ముఖ్యుల రాకతో ఇంట సందడి నెలకొంటుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. విద్యుత్, ఏసీ, మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. రాజకీయ నాయకులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. 
 
కన్య
ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. 
 
తుల
అరుదైన ఆపరేషన్లను డాక్టర్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. మానసికస్థైర్యంతో అడుగు ముందుకేయండి. అనుకున్నది సాధిస్తారు. 
 
వృశ్చికం
కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహోపకరణాలు వస్తువుల కొనుగోలుకై షాపింగ్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గొప్పగొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
ధనస్సు
ఎదుటివారి వేషధారణచూసి మోసపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. పాత మొండిబాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు తలెత్తవచ్చు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. 
 
మకరం
ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాభివృద్ధికై చేయుకృషిలో పోటీ అధికమవ్వడంతో ఆందోళన తప్పదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. లిటిగేషన్ వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. 
 
కుంభం 
మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలే జరుగుతుంది. ఏ మాత్రం పొదువు సాధ్యంకాదు. మీ సంతానం కోసం విలువైన వస్తువులు సేకరిస్తారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యాజ్యాలు ఉపసంహరించుకుంటారు. 
 
మీనం
చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి నెలకొంటుంది. స్త్రీలకు స్వీయ అర్జనపట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.