బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (13:29 IST)

స్నేహితులుంటే సరిపోదు... వారితో అలా గడపాలి...

సామాజిక మాధ్యమాల వలన ఈ రోజుల్లో స్నేహం విస్తరించుకోవడం సహజమే. కానీ ఆ స్నేహాలను కొనసాగించడం కూడా తెలుసుకోవాలి. మరి అదెలాగో చూద్దాం. స్నేహితులతో ఉన్నపాత జ్ఞాపకాలు గుర్తువావడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.

సామాజిక మాధ్యమాల వలన ఈ రోజుల్లో స్నేహం విస్తరించుకోవడం సహజమే. కానీ ఆ స్నేహాలను కొనసాగించడం కూడా తెలుసుకోవాలి. మరి అదెలాగో చూద్దాం. స్నేహితులతో ఉన్నపాత జ్ఞాపకాలు గుర్తువావడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అయితే ఎప్పటికప్పుడు కొత్త అనుభూతులు, జ్ఞాపకాలు కూడా ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా స్నేహితులంతా కలుసుకుని గడిపేందుకు ప్రయత్నించాలి.
 
కనీనం నెలలో ఒకరోజు స్నేహితులకోసం గడిపే ప్రయత్నాలు చేయాలి. అప్పుడే మీ స్నేహం ఇంకా బలపడుతుంది. దగ్గరి స్నేహితురాలికి ఏదైనా సమస్య వచ్చిదంటే వెంటనే తోచిన సలహాలు ఇవ్వడం సరికాదు. మీరు తనకు అండగా ఉంటారనే భరోసాను ఇవ్వాలి. ఆ విషయాన్ని పదేపదే అడగడం కూడా సరికాదు. మీ తీరు ఎప్పుడు అవతలివారిని బాధపడేలా చేయకూడదు. 
 
ఎంత మీ స్నేహితురాలైనా సరే వాళ్లకంటూ వ్యక్తిగత జీవితం, కొన్ని బాధ్యతలు ఉంటాయని ఎప్పుడు మరవకూడదు. మీరు పెట్టిన సందేశాలకు సమాధానాలు ఇవ్వకపోయినా, ఫోన్స్‌లో మాట్లాడకపోయినా స్నేహితులకు అర్థం చేసుకునేలా ఉండాలి. స్నేహితులే కదా మనం చెప్పినవన్నీ చేస్తారనుకోవడం మాత్రం ఎప్పుడు సరికాదు.

వాళ్లకు సంబంధించి ఏదైనా మాట ఇవ్వాలన్నా ముందు వాళ్ల అనుమతిని తీసుకోవాలి. చెప్పకుండా వాళ్లకు సంబంధించిన వస్తువులు తీసుకుని వాడుకోవడం ఏమాత్రం సరికాదు.