గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 25 జులై 2018 (17:51 IST)

నిద్రించేటపుడు స్మార్ట్‌ఫోన్స్ పక్కన పెట్టుకుంటున్నారా?

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలామంది అదే లోకమనుకుని గడుపుతుంటారు. ఎక్కడికెళ్లినా ఫోన్‌ను వదలరు. ఇంకా చెప్పాలంటే పడుకునేటప్పుడు కూడా ఫోన్‌ను పక్కన పెట్టుకునే నిద్రిస్తున్నారు చాలామంది. అలాంటి వారికి క్యా

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలామంది అదే లోకమనుకుని గడుపుతుంటారు. ఎక్కడికెళ్లినా ఫోన్‌ను వదలరు. ఇంకా చెప్పాలంటే పడుకునేటప్పుడు కూడా ఫోన్‌ను పక్కన పెట్టుకునే నిద్రిస్తున్నారు చాలామంది. అలాంటి వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
స్మార్ట్‌ఫోన్ నుండి వెలువడే రేడియో తరంగాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. చార్జింగ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడడం వలన అధికస్థాయిలో రేడియేషన్ ఎక్కువగా విడుదలయ్యే ప్రమాదముంది. అప్పుడే ఫోన్ పేలిపోవడం, పొగలు రావడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రేడియేషన్ వలన తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాలున్నాయి.
 
మెుబైల్ రేడియేషన్ వలన వచ్చే అతిపెద్ద వ్యాధి క్యాన్సర్. అంతేకాకుండా పలు మెుబైల్ కంపెనీలు మెుబైల్ డివైజ్‌లతో పాటు ఇచ్చే సెట్‌లలో చెప్పబడుతుంది. కాని అవేం చదువం కాబట్టి మనకు తెలియదు. ఫోన్ ఎక్కువగా మాట్లాడడం వలన వినికిడి సమస్యలు అధికంగా ఏర్పడుతాయి. సాధ్యమైనంత వరకు స్మార్ట్‌ఫోన్ వాడకానికి దూరంగా ఉంటే మంచిది.