బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By ivr
Last Updated : సోమవారం, 23 మే 2016 (16:43 IST)

పబ్లిక్‌గా ఆ పనులు చేస్తున్నారు... మీకోసం వాటిని తప్పక మానేస్తారు... ప్రయత్నం చేయండి...

కాలేజీ రోజుల్లో నన్ను ఎంతగానో ప్రేమించాడు అతను. నేను ఒక్కరోజు కూడా అతనికి చనువు ఇవ్వలేదు. కానీ ధైర్యం చేసి అతడే మా అమ్మనాన్నలను సంప్రదించి నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. నా తల్లిదండ్రులు అతడి ఫ్యామ

కాలేజీ రోజుల్లో నన్ను ఎంతగానో ప్రేమించాడు అతను. నేను ఒక్కరోజు కూడా అతనికి చనువు ఇవ్వలేదు. కానీ ధైర్యం చేసి అతడే మా అమ్మనాన్నలను సంప్రదించి నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. నా తల్లిదండ్రులు అతడి ఫ్యామిలీ గురించి వాకబు చేసి సంతృప్తి వ్యక్తం కావడంతో తనని పెళ్లి చేసుకోవాలని సూచించారు. నాకోసం మూడేళ్లుగా తిరుగుతూ ఉండే అతడే నా భర్త కావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మా పెళ్లి గ్రాండ్ గా జరిగిపోయింది. పెళ్లై ఏడాది దాటుతోంది. మావారికి నేనంటే ప్రాణంతో సమానం. 
 
మా బంధువులు మమ్మల్ని చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. ఆయన కూడా అందంగానే ఉంటారు. ఐతే నాపై ఆయన చూపిస్తున్న ప్రేమ పరిధులు దాటిపోతోంది. ఇంటా బయట అనే తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ గబుక్కున ముద్దు పెట్టుకుని... ఐ లవ్ యూ బంగారం అంటూ కౌగలించుకుంటారు. ఇలా రోజుకు కనీసం ఏడెనిమిదిసార్లు చేస్తారు. ఎవరూ లేనప్పుడయితే ఓకే కానీ పదిమంది జనం ఉన్నప్పుడు కూడా ఇలా చేస్తున్నారు. ఈయన ప్రవర్తన తప్పు అని చెప్పలేను... అలా అని వారించలేకపోతున్నాను. ఏం చేయాలి...?
 
ప్రేమికుడిగా మిమ్మల్ని దక్కించుకున్నానన్న ఆనందం ఆయనను ఉబ్బితబ్బిబ్బు చేస్తోంది. దీనితో బయటి ప్రపంచాన్ని సైతం మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆయనకు మీరు తప్ప మరో లోకం కనబడటం లేదు. ఐతే బహిరంగంగా ఇలా ప్రవర్తించడం కాస్త ఇబ్బందే. మీరంటే ఆయనకు ప్రాణాతిప్రాణం అయినప్పటికీ సమాజంలో ఇలాంటి ప్రవర్తన చెడు సంకేతాలను సూచిస్తుంది. ఇందులో మీరు సిగ్గుపడుతూ చెప్పకుండా ఊరుకోరాదు. ఆయనకు మెల్లగా సమస్యను చెప్పండి. అర్థం చేసుకుంటారు. మీకోసం ప్రాణం ఇచ్చేటంత ప్రేమికుడు కదా... మీకోసం తప్పక చేస్తారు. ప్రయత్నం చేసి చూడండి.