1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
  4. Swami Vivekananda message

మనస్సుకూ శిక్షణ అవసరం... వివేకానందుడి బోధన....

మనస్సును స్వాధీనం చేసుకోవడమంటే దానికి సరైన ప్రవర్తనను అలవరచడమే. ఒక అడవి గుర్రాన్ని పట్టుకుని దాన్ని అదుపులోకి తెచ్చి ఒక సర్కస్‌ గుర్రంగా తయారుచేసి విన్యాసాలు నేర్పించడం లాంటిది. దాన్ని ఆ విధంగా చెయ్యడం ఎలా? వివేకానందుడు ఇలా బోధించాడట. మనస్సుని స్వాధీ

Swami Vivekananda message
మనస్సును స్వాధీనం చేసుకోవడమంటే దానికి సరైన ప్రవర్తనను అలవరచడమే. ఒక అడవి గుర్రాన్ని పట్టుకుని దాన్ని అదుపులోకి తెచ్చి ఒక సర్కస్‌ గుర్రంగా తయారుచేసి విన్యాసాలు నేర్పించడం లాంటిది. దాన్ని ఆ విధంగా చెయ్యడం ఎలా? వివేకానందుడు ఇలా బోధించాడట. మనస్సుని స్వాధీనం చేసుకోబోయే ముందు మనం తప్పనసరిగా దాన్ని అధ్యయనం చేయాలి. ఈ చంచలమైన మనస్సును దొరక బుచ్చుకొని అది చేసే షికారుల నుంచి దాన్ని లాగి తీసుకుని వచ్చి ఒకే ఒక ఆలోచన మీద లగ్నం చేయాలి.
 
మన సంకల్ప శక్తితో మనస్సు మీద పట్టు సాధించి అది నిలకడగా భగవంతుని ధ్యానించేటట్టు చేయాలి. మనస్సుపైన పట్టు సాధించడానికి అతి సులువైన పద్థతి ఏమిటంటే కొంతసేపు ఒకచోట ప్రశాంతంగా కూర్చుని మనస్సు దాని ఇష్టం. వచ్చినట్లయితే అటు పోనివ్వడమే. ఆ సమయంలో నేను నా మనస్సును కాను ఎటుపడితే అటు కొట్టుకుపోతున్న ఈ మనస్సును గమనిస్తున్న సాక్షిని మాత్రమే అనే ఆలోచనను స్థిరంగా కలిగి ఉండాలి. అలా మనస్సును మీతో ఎటువంటి సంబంధం లేని దానిగా గమనించండి.
 
మనస్సును మీ ముందు కనిపిస్తున్న ఒక నిశ్చలమైన సరస్సుగాను, ఆలోచనను ఆ సరస్సులో నుంచి పైకి లేచి నీటి మీద పగులుతున్న నీటి బుడగలుగాను చిత్రీకరించుకోండి. ఇలా చేస్తే నీటి బుడగలు పగిలి ఏర్పడుతున్న గుండ్రని అలలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఆలోచనలు పెద్ద వలయాలుగా మొదలుపెట్టి క్రమంగా వాటిని చిన్నవి చేస్తూ చివరికి వాటిని ఒక బిందువుగా చేసి మనస్సును దానిపై పెట్టి అది అక్కడే నిలిచి ఉండేలా చేయాలి. నేను మనస్సును కాను సాక్షిని మాత్రమే అనే భావనను స్థిరపరుచుకోండి. 
 
క్రమంగా మిమ్మల్ని మీరు మీ మనస్సు నుంచి పూర్తిగా వేరు చేసుకొని మీరు మీ మనస్సు వేర్వేరని నిజంగా తెలుసుకుంటారు. ఈ పని సాధించినప్పుడు మనస్సు మీ స్వాధీనంలో ఉండే ఒక సేవకునిలాగా మారిపోతోంది. యోగి కావడానికి మొదటి దశ ఇంద్రియాలను అధిగమించడమే. 
 
ఈ విధంగా ఎప్పుడైనే మనస్సు జయించబడుతుందో అప్పుడు ఆ మనిషి అత్యున్నత స్థితికి చేరినట్టే. ఈ సాధనను ప్రారంభించినప్పుడు మన మనస్సులోకి ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు వస్తాయో చూసి నివ్వెరపోతాం. సాధన కొనసాగుతున్నప్పుడు కొంతకాలం మనస్సులో అశాంతి పెరగవచ్చు. అయితే మన మనస్సు నుంచి మనల్ని ఎంతగా వేరుగా చేసుకుంటామో. దాని విపరీతపు చేష్టలు అంతగా తగ్గిపోతాయి. తనను గమనిస్తున్న తక్షణమైన చూపుల వల్ల మనస్సు యొక్క అనిశ్చితి క్రమక్రమంగా శాంతిస్తుంది. చివరికి మనస్సు మచ్చిక చేసిన గుర్రంలాగా శక్తిమంతంగానూ క్రమశిక్షణ కలిగినదిగానూ తయారవుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా కొంతకాలం పాటు మనస్సును ప్రయత్న పూర్వకంగా ఇలా పరిశీనలో పెట్టాలి. మనస్సుకు సరిగా ఎలా ప్రవర్తించాలో నేర్పాల్సిన అవసరం ఉన్నంత కాలం దీనిని కొసాగించాలి.
About Writer
ttdj
తర్వాతి కథనం
ద్రాక్ష, లవంగం వాసనలు మగవారిలో ఆ కోరికలను రేకెత్తిస్తాయట..