గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (14:32 IST)

కార్తీకంలో ఉల్లి, పుట్టగొడుగులు, ముల్లంగి తినకూడదట..

కార్తీక మాసం పవిత్రమైనది. ఈ మాసం మొత్తం ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు ఇంటి గడపల వద్ద, తులసి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి.

కార్తీక మాసం పవిత్రమైనది. ఈ మాసం మొత్తం ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు ఇంటి గడపల వద్ద, తులసి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. కార్తీకంలో అల్పాహారం తీసుకుని, ఒంటిపూట భోజనం చేసేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ నెలంతా ఉపవాసం చేయలేనివారు కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి దినాల్లో ఉపవాసం, దీపారాధన చేయాలి. ఉపవాసం చేయకపోయినా.. దీపారాధన చేసేవారికి జీవితంలో సంతోషదాయక మార్పులుంటాయని పండితులు అంటున్నారు.
 
అలాగే ఈ మాసంలో ఉల్లి, పుట్టగొడులు, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాడలు, వంకాయ, గుమ్మడి, వెలగపండు, మాంసాహారం, పెసలు, సెనగలు, ఉలవలు, కందులు వాడకూడదని పండితులు చెప్తున్నారు. కార్తీకస్నానం చేసినవారి అశ్వమేధ ఫలాన్ని పొందుతారు. కార్తీక దీపాన్ని శివలింగ సన్నిధిలో దీపారాధన చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. కార్తీకంలో శివాలయంలో ఆవునేతితోగాని, నువ్వులనూనెతోగాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని పురాణాలు చెప్తున్నాయి. 
 
విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పది, పదకొండు అధ్యాయాలను పారాయణ చేస్తారో, వారి పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారని, తులసీదళాలతో, తెలుపు లేక నలుపు గన్నేరుపూలతోగాని శ్రీమహావిష్ణు పూజను చేస్తారో, వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలననుభవిస్తారని, కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, పద్దెనిమిది పురాణాలలో ఏదైనా సరే ప్రవచించితే సర్వకర్మబంధ విముక్తులవుతారని వశిష్ఠ వచనం.
 
పూర్వ జన్మ పాపాలన్నీ కూడా కార్తీకవ్రతం వలన హరించుకుపోతాయి. కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్రదర్శనానంతరం భోజనం చేస్తూ - ఆ రోజంతా భగద్ద్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారు.