బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (10:52 IST)

కార్తీకమాసంలో పంచముఖి రుద్రాక్షను పూజిస్తే?

పంచముఖి రుద్రాక్షను కార్తీక మాసంలో శివుడి పటం వద్ద వుంచితే ధనప్రాప్తి చేకూరుతుంది. అదృష్టం వరిస్తుంది. పంచముఖి రుద్రాక్షను ఇంట్లో శివుని చిత్ర పటం వద్ద లేదంటే శివుని లింగం వద్ద వుంచి పూజిస్తే ఈతి బాధల

పంచముఖి రుద్రాక్షను కార్తీక మాసంలో శివుడి పటం వద్ద వుంచితే ధనప్రాప్తి చేకూరుతుంది. అదృష్టం వరిస్తుంది. పంచముఖి రుద్రాక్షను ఇంట్లో శివుని చిత్ర పటం వద్ద లేదంటే శివుని లింగం వద్ద వుంచి పూజిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి. శివుని వద్ద పంచముఖి రుద్రాక్షను వుంచి రోజూ రాగి గిన్నెలో నీటిని సమర్పించినట్లైతే అనుకున్న కార్యాల్లో విజయం చేకూరుతుంది.
 
ఇంట్లో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే పంచముఖి రుద్రాక్షను శివుడి దగ్గర వుంచి, శివునికి సమానంగా పూజ చేయాలి. ఇలా చేస్తే.. అందులోని శక్తి ఇంటి మొత్తం వ్యాపించి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుటుంబానికి రక్షణను ఇస్తుంది. కార్తీక మాసంలో మంచి రోజున పంచముఖి రుద్రాక్షను పూజా మందిరంలో, శివుని వద్ద వుంచి పూజిస్తే అభివృద్ధితో పాటు అదృష్టం కూడా వరిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఇంకా కార్తీక మాసంలో స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి ''కార్తీకమాసం" అని పేరు వచ్చింది.