Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మంగళవారం 21 లడ్డూలు హనుమంతునికి సమర్పిస్తే?

సోమవారం, 4 డిశెంబరు 2017 (14:09 IST)

Widgets Magazine

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున నిష్ఠతో శుచిగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానమాచరించాలి. ఇంటిని, పూజాగదిని శుభ్రం చేసుకోవాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. హనుమంతుని పూజకు సిద్ధం కావాలి. స్వామివారికి నైవేద్యంగా వెన్న, తీపి పదార్థాలు, తామరపువ్వులు సిద్ధం చేసుకోవాలి. తమలపాకుల మాల, వడమాలలను కూడా సమర్పించవచ్చు. ముఖ్యంగా హనుమంతునికి లడ్డూలను సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
 
పూజకు తర్వాత బ్రాహ్మణులకు ఆ లడ్డూలను దానం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మంగళవారం ఒంటి పూట భోజనం చేసి.. కారం, ఉప్పు అధికంగా లేని పదార్థాలను తీసుకోవాలి. 21 వారాల పాటు మంగళవారం హనుమంతుడిని పూజించే వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. మంగళవారం హనుమంతుడి వ్రతంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత, సంతానం, ఉన్నత ఉద్యోగ అవకాశాలు, లక్ష్యాలను చేరుకోవడం వంటి శుభఫలితాలుంటాయని పండితులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఇకపై శ్రీవారి ప్రసాదం చేదు... ఎందుకంటే?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం ఇకపై తీపికి బదులు చేదుగా ...

news

శ్రీవారి ఆలయం ఎదుట పందుల సంచారం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు పందులు సంచరించాయి. ఆదివారం ఉదయం 7 గంటల ...

news

ఆధార్ లింక్‌తో శ్రీవారి దర్శనానికి టైమ్‌స్లాట్‌ : ఈవో అనిల్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి ఇకపై టైమ్‌స్లాట్ విధానాన్ని అమలు ...

news

గీత పుట్టింది ఈ రోజే.. అర్జునునికి శ్రీకృష్ణుడి ఉపదేశం.. సూక్తులు

అర్జునునికి నాడు గీతోపదేశం చేసింది.. ఈ రోజే. మనిషి తత్వాన్ని విశ్లేషించిన గీత పుట్టిన ...

Widgets Magazine