శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2017 (08:30 IST)

సోమవారం దినఫలితాలు : స్త్రీలకు ధనలాభం...

మేషం : కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీలకు ధనలాభం, పుణ్యక్షేత్రా సందర్శన వంటి శుభఫలితాలున్నాయి. ఆస్తి, కోర్టు వ్యవహారాలు పరిష్కారం కాక నిరుత్సాహం చెందుతారు. వృతిపరంగా ప్రజా సంబంధాలు మెరుగ

మేషం : కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీలకు ధనలాభం, పుణ్యక్షేత్రా సందర్శన వంటి శుభఫలితాలున్నాయి. ఆస్తి, కోర్టు వ్యవహారాలు పరిష్కారం కాక నిరుత్సాహం చెందుతారు. వృతిపరంగా ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. బ్యాంకింగ్ వ్యవహరాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమతత్త అవసరం.
 
వృషభం : ఉద్యోగస్తులు తోటివారి విషయంలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. పాత మిత్రల కలయిక మీ ఉన్నతకి దోహదపడతాయి. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. దంపతుల మధ్య అన్యోన్యత చోటు చేసుకొంటుంది. దూరప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయులకు ప్రశంసలు లభిస్తాయి.
 
మిథునం : ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, ఇతరత్రా చికాకుల తప్పవు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కోక తప్పదు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆత్మీయులకు కానుకలు సమర్పించుకుంటారు.
 
కర్కాటకం : వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు ఒత్తిడి పెరుగుతుంది. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. స్త్రీలకు టి.వి. కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని అంశాలు నచ్చకపోయినా సర్దుకుపోవలసివస్తుంది. అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
సింహం : హోటల్. కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. సన్నిహితులు మిమ్ములను ఉద్రేకపరిచి మీచే ధనం విపరీతంగా వ్యయం చేయిస్తారు. నిరుద్యోగులు, వృతుల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
కన్య : ప్రైవేటు సంస్ధలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. మీ కుటుంబీకుల్లో వచ్చిన మార్పు సంతోషం కలిగిస్తుంది. ఏ విషయంలోను  ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి.
 
తుల : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలు పెడతారు. ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని  అసంతృప్తి వెన్నాడుతుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు.
 
వృశ్చికం : విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. చేతి వృత్తుల వారు, నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవటం శ్రేయస్కరం. మీ కళత్ర  మొండివైఖరి, పట్టుదల మిమ్మల్ని ఇరకాటంలో పెడతాయి. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
ధనస్సు : వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాల దిశగా సాగుతాయి. బంధువుల రాకా మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కుటుంబ, ఆర్థిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రముఖులతో తరచు సభ, సమావేశాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యములో మెళుకువఅవసరం.
 
మకరం : ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఆప్తుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. సంగీతం, సాహిత్య కార్యక్రమాల పట్లఏకాగ్రత వహిస్తారు. మీ శ్రమకు తగన ఫలితం దక్కుతుంది. మీ గౌరవానికి భంగం కలిగే సంఘటనలు ఎదురవుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
కుంభం : ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. తలపెట్టిన పనిలో ఆటంకాలు, చికాకులు ఎదురైనా తెలివితో పరిష్కరిస్తారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలుజ్ఞప్తికి వస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
 
మీనం : ఆపత్సయంలో ఆత్మీయుల తోడ్పాటు మీకు మనో ధైర్యాన్నిస్తుంది. ప్రైవేటు ఫైనాన్సులో మదుపు చేయటం మంచిది కాదని గమనించండి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. ఫర్నిచర్ అమరికలకు అవసరమైన నిధులు సమ కూర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.