మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2024 (13:32 IST)

రీల్స్ కోసం.. శునకాన్ని ఆటోపై ఎక్కించుకుని తిరిగాడు.. (Video)

Dog Auto Roof
Dog Auto Roof
రీల్స్ కోసం పిచ్చిపిచ్చి పనులు చేసే వారు పెరిగిపోతున్నారు. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఏవేవో చేస్తున్నారు. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రీల్స్ కోసం తన పెంపుడు శునకాన్ని ఆటోపైకి ఎక్కించుకుని తిరిగాడు.. ఓ ఆటో డ్రైవర్. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెంపుడు శునకం ఆటో టాప్‌పై నిల్చుని వుంది. ఆటో డ్రైవర్ దానిని అలానే నిల్చుండి బెట్టుకుని ఆటో నడుపుతున్నాడు. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ పెంపుడు కుక్క కిందపడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 
 
ముంబైకు చెందిన ఓ వ్యక్తి ఆటో టాప్‌పై కుక్కని నిల్చొపెట్టి వాహనాన్ని నడిపడంపై వారు ఫైర్ అవుతున్నారు. ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.