శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (08:20 IST)

శుక్రవారం రాశి ఫలితాలు : ఖర్చులు అధికంగా ఉన్నా....

మేషం : ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏమరుపాటుకూడదు. మీ రాక బంధువులకు ఉత్సాహం కలిగిస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను పరిష్కరిస్తారు. దైవసేవా కార్యక్రమాల్లో పా

మేషం : ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏమరుపాటుకూడదు. మీ రాక బంధువులకు ఉత్సాహం కలిగిస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను పరిష్కరిస్తారు. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యాజ్యాలు, ఫిర్యాదులు ఉపసంహరించుకుంటారు.
 
వృషభం : హామీలు, చెక్కుల జారీలో పునరాలోచన మంచిది. కొన్ని వ్యవహారాలు సానుకూలతకు ధనం బాగా వ్యయం చేయవలసి ఉంటుంది. ఆత్మీయులకు కానుకలు సమర్పించుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. 
 
మిథునం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. స్త్రీలకు  బంధువర్గాల నుంచి ఆహ్వానాలు లేక ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. ఏమాత్రం పొదువు సాధ్యంకాదు. 
 
కర్కాటకం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. స్త్రీలకు గృహాలంకరణ పట్ల ఆసక్తి కనపరుస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
సింహం : ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. వ్యవసాయ కూలీలకు, వృత్తుల వారికి ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
కన్య : నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. దైవ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోస్టర్, ఎల్ఐసీ ఏజెంట్లకు, ఇళ్ళస్థలాల బ్రోకర్లకు పురోభివృద్ధి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ప్రముఖులు సహకారంతో సదావకాశాలు లభిస్తాయి. 
 
తుల : వస్త్ర, వెండి, బంగారం, లోహ పనివారలకు ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబీకులకు ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. బంధువులను కలుసుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులకు శుభాకాంక్షలు, బహుమతులు అందించి, వారి ప్రాపకం సంపాదిస్తారు. 
 
వృశ్చికం : వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కోక తప్పదు. ప్రయాణాలలోనూ, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. 
 
ధనస్సు : రుణ యత్నాల్లో ఆటంకాలు, ధనం సకాలంలో అందకపోవడం వల్ల మీ ఆర్థిక వ్యవహారాలు వాయిదాపడతాయి. ఉపాధ్యాయులకు, వృత్తుల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. పెద్దల, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. 
 
మకరం : ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఏకాగ్రతతో పని చేయవలసి ఉంటుంది. హామీల విషయంలో పునరాలోచన మంచిది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులుపడటం వల్ల మాటపడక తప్పదు. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. 
 
కుంభం : వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు చికాకులు, ఒత్తిడి తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 
 
మీనం : వ్యాపారాల్లో పెరిగిన పోటీని తట్టుకోవడానికి బాగా శ్రమించాలి. మీ అభిప్రాయాలు బయటకు వ్యక్తం చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఇతరుల కారణాల వల్ల మీ కార్యక్రమాలు వాయిదాపడతాయి. నూతన పరిచయాలేర్పడతాయి. స్త్రీలకు తమ బంధువర్గాల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి.