శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : శనివారం, 16 ఆగస్టు 2014 (13:47 IST)

కృష్ణాష్టమి స్పెషల్ : అటుకుల లడ్డూ చేసేద్దాం!

కృష్ణాష్టమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. చిన్ని కృష్ణున్ని తమ ఇళ్లకు ఆహ్వానిస్తూ పడతులు కృష్ణ పాదాలు వేస్తారు. బాలకృష్ణుడు తమ ఇంట అడుగుపెడితే సకలశుభాలు కలుగుతాయని భావిస్తారు. 
 
శ్రీ కృష్ణుడికి అటుకులంటే ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే. అందుచేత కృష్ణుడి పుట్టినరోజున.. చిట్టి పాదాలతో నడిచి వచ్చే ఆ స్వామికి ఇష్టమైన అటుకులతో ఈ తీపి వంటకం సమర్పిద్దాం... 
 
అటుకుల లడ్డూ ఎలా చేయాలి?
అటుకులు: రెండు కప్పులు
నెయ్యి: నాలుగు టేబుల్ స్పూన్లు 
జీడిపప్పు: 15
కిస్ మిస్: పావు కప్పు
బెల్లం తురుము: ఒక కప్పు 
కొబ్బరి తురుము: ఒక కప్పు 
యాలకులపొడి: రెండు టీ స్పూన్లు 
 
తయారీ విధానం : ముందుగా స్టౌ మీద మందపాటి పాన్ పెట్టి అందులో అటుకుల్ని లేతగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి. తర్వాత వేయించిన అటుకులను, కొబ్బరి తురుము, యాలకులు, జీడిపప్పును మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇందులో బెల్లం తురుము కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ గ్రైడ్ చేసుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోని తీసుకొని నెయ్యి, కిస్ మిస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా చేతిలోనికి తీసుకొని లడ్డులా వత్తుకోవాలి. అంతే కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల లడ్డు రెడీ.