గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By PNR
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2015 (17:26 IST)

సీతాఫల్ ఐస్‌క్రీంను ఎలా తయారు చేస్తారు?

సీతాఫల్ ఐస్‌క్రీంకు కావాల్సిన పదార్థాలు 
 
బాగా పండిన సీతాఫలాలు : నాలుగు
పాలు : 2 కప్పులు
మేరీ బిస్కెట్స్ : 5
చక్కెర : సరిపడ. 
 
తయారీ విధానం.. 
సీతాఫలం పండ్లను కడిగి వాటి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సర్ జార్‌లో చిక్కటి పాలు, మేరీ బిస్కెట్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి చక్కెర, సీతాఫలం గుజ్జు కలిపి మళ్లీ మరోమారు గ్రైండ్ చేయాలి. అప్పుడు చిక్కటి క్రీమ్ తయారవుతుంది. దాన్ని రెండు గంటలు డీప్ కూలింగ్ చేసి బయటకి తీసి తర్వాత మళ్లీ రెండు సార్లు బ్లైండ్ చేసి ఫ్రిజ్‌లో పెడితే చల్లచల్లని సీతాఫల్ ఐస్‌క్రీం రెడీ. ఇది తినేందుకు నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది.