సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (12:13 IST)

లంచం తీసుకోనన్న పోలీసు.. ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్

kiss
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ యువతి పోలీసులకి లంచం ఇస్తే పోలీసు దానికి నిరాకరించాడు. దీంతో ఆమె ముద్దు ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనం అవుతోంది. అయితే ఒక అమ్మాయి తప్పు చేయడంతో పోలీసు ఆమెని పట్టుకున్నాడు.
 
అయితే ఆమె పోలీసు నుండి ఎలాగైనా బయట పడాలని అనుకుంది. కానీ అది కుదరడం లేదు. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులు ఆమెని విడిచిపెట్టలేదు. దీనితో ఆమె బలవంతంగా పోలీస్‌ని అందరి ముందు ముద్దు పెట్టుకుంది. అక్కడ చూస్తున్న జనం అందరూ కూడా అయిపోయారు.
 
ఇప్పటికే మిలియన్ల మంది ఈ వీడియోని చూశారు. 62 వేల మంది ఈ వీడియోని లైక్ చేశారు. పైగా చాలా కామెంట్లు కూడా వచ్చాయి ఈ వీడియో చూసిన ఒక నెటిజన్ ఒకవేళ ఇదే పని అబ్బాయి చేసుంటే రేప్ చేశాడని అనేవారు ఏమో అని కామెంట్ చేశాడు.