సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:40 IST)

రక్షా బంధన్ : విష సర్పాలకు రాఖీ కడుతూ ప్రాణాలు కోల్పోయాడు..

రక్షా బంధన్ అంటే.. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. కానీ, ఇక్కడో వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. విష సర్పాలకు రాఖీ కడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లా మాంజీ సీతల్ పూర్ గ్రామానికి చెందిన మన్మోహన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన పాములు పట్టడంలోనూ, పాము కాటుకు గురైన వారికి చికిత్స చేయడంలోనూ ఆ ప్రాంతంలో సుప్రసిద్ధుడు.
 
అయితే, రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు నాగుపాములు తీసుకువచ్చాడు. వాటికి రాఖీలు కట్టేందుకు ప్రయత్నించాడు. అతడు ఏమరుపాటుగా ఉన్న సమయంలో ఓ సర్పం అతడి కాలిపై కాటేసింది. 
 
అయితే, వైద్యం సాయం తీసుకునేలోపే అతని ప్రాణాలు పోయాయి. అతడిని పాము కరిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. మన్మోహన్ మృతితో అతడి స్వగ్రామంలో విషాదం అలముకుంది.