శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : శనివారం, 6 జూన్ 2015 (19:03 IST)

మీల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసా?

ఈ వీకెండ్ మీల్ మేకర్‌తో బిర్యానీ చేద్దాం.. మీల్ మేకర్‌లో ప్రోటీనులు అధికం.బిర్యానీ రిసిపికి రైతా చక్కటి కాంబినేషన్. పుదీనా రైతా కూడా చాలా చక్కటి ఫ్లేవర్ మరియు టేస్ట్‌ను అందిస్తుంది. 
 
కావలసిన పదార్థాలు:
బియ్యం : అర కేజీ 
నెయ్యి : నాలుగు స్పూన్లు
లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యాని ఆకులు : రెండేసి చొప్పున 
మీల్ మేకర్ : ఒక కప్పు 
పుదినా :  రెండు కప్పు
కొత్తిమీర : రెండు కప్పులు
బిర్యానీ మసాలా : ఒక టీ స్పూన్ 
ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు : అరకప్పు 
ఉప్పు : తగ్గినంత 
 
తయారీ విధానం: 
స్టౌ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక అందులో చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి. అవి వేగాక పుదీనా, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత వేడినీళ్ళలో వేసి ఒక నిమిషం ఉంచి నీళ్ళు పిండేసిన మీల్ మేకర్ వేసి కాసేపు వేయించాలి.

తర్వాత బియ్యం కలిపి ఐదు కప్పుల నీటిని చేర్చాలి. అందులోనే ఉప్పు, బిర్యానీ మసాలా వేసి మూతపెట్టి ఉడికించాలి. కాసేపటికి బిర్యానీ రెడి అవ్వుతుంది. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి దీనిలో కొత్తిమీర వేసి మూత పెట్టాలి. అంతే సర్వ్ చెయ్యటానికి మిల్ మేకర్ బిర్యానీ రెడి.