Widgets Magazine

ఆఫీసుల్లో కూర్చునే చోట మంచి నీళ్ల సీసా వద్దు

ఆదివారం, 12 ఆగస్టు 2018 (13:30 IST)

ఆఫీసుల్లో గంటల పాటు కూర్చునే మహిళలు ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఉద్యోగం, ఇల్లు ఇలా రెండు పనులు చేసుకుంటూ.. వ్యాయామానికి సమయం లేదని చాలామంది మహిళలు అంటున్నారు. ఈ క్రమంలో బరువు పెరిగినా పట్టించుకోరు. పనులపై దృష్టి పెట్టి అనారోగ్యాలు తెచ్చుకుంటారు. అలాంటి వారు మీరైతే... ఈ కథనం చదవండి 
 
ఆఫీసుల్లో గంటలు గంటలు కూర్చునేవారు పవర్‌ వాక్‌ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. కాసేపు నిదానంగా, మరికాసేపు వేగంగా.. నడవడం అలవాటు చేసుకోవాలి. కూర్చునే చోట మంచినీళ్ల సీసా అందరూ పెట్టుకుంటారు. నిజానికి సీసా పెట్టుకోకుండా దాహం వేసిన ప్రతిసారీ ప్యాంట్రీకి వెళ్లి తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా మాటిమాటికీ చేస్తే వ్యాయామం చేసినట్లవుతుంది. 
 
పనిమీద శ్రద్ధ పెట్టడం వల్ల ధ్యాస మిగతా వాటి మీద ఉండదు. అందుకే గంటకోసారి అలారం పెట్టుకోవాలి. ఫిట్‌నెస్‌ కోసం పెట్టుకున్న ఈ అలారం మోగినప్పుడు చేతులు లేదంటే కాళ్లూ, మెడా కదుపుతూ ఉండాలి. ఇక గంటల పాటు కూర్చునే వారు అవిసెగింజలూ, బాదం, ఖర్జూరం, నట్స్‌ వంటివి ఆఫీసు ర్యాకులో పెట్టుకోవాలి. ఇవి తక్షణశక్తిని అందిస్తాయి. గ్యాస్‌ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
ఆఫీస్ బాదం ఖర్జూరం నట్స్‌ మహిళలు వాటర్ బాటిల్స్ Dates Office Exercise Woman Walking Badam Nuts Health Tips

Loading comments ...

మహిళ

news

ఎండిన చామంతి పువ్వుల మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?

గులాబీ పువ్వులు వాడిపోతే వాటిని పారేయకుండా నీడలో రెండుమూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ...

news

ఉప్పును మూటలా కట్టి ఇంటి మూలలో పెట్టుకుంటే?

వర్షాకాలం వచ్చిందంటే చాలు బట్టలు ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారిపోతుంది. ఆరబెట్టి ...

news

గోర్లు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

శరీరంలో ఉన్న అవయవాల్లో గోర్లు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి నిర్జీవ కణాలే అయినప్పటికీ వీటిని ...

news

కలబంద ఆకుల మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?

చాలామందికి ఎక్కువగా బయట తిరగడం వలన ముఖంపై జిడ్డు, మురికి ఏర్పుడుతుంటాయి. మరికొంతమందికి ...

Widgets Magazine