ప్రతి రోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది...

చాలా మందికి ఉదయం వేళలో ఎలాంటి ఆహారం ఆరగించాలో తెలియదు. అందుకే ఆ సమయానికి లభించిన ఆహారాన్ని ఆరగిస్తుంటారు. మరికొందరు మాత్రం రోజూచేసే అల్పాహారాన్నే తీసుకుంటుంటారు.

breakfast
pnr| Last Updated: బుధవారం, 8 ఆగస్టు 2018 (15:42 IST)
చాలా మందికి ఉదయం వేళలో ఎలాంటి ఆహారం ఆరగించాలో తెలియదు. అందుకే ఆ సమయానికి లభించిన ఆహారాన్ని ఆరగిస్తుంటారు. మరికొందరు మాత్రం రోజూచేసే అల్పాహారాన్నే తీసుకుంటుంటారు. నిజానికి వైద్యులు చెప్పినట్టుగా అల్పాహారం తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరమని చెబుతున్నారు. పైగా, శరీరానికి కావాల్సిన పోషణ శక్తి కూడా బాగా అందుతుందట. మరి ఉదయం మనం తినాల్సిన ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* ప్రతి రోజూ ఉదయాన్ని నాలుగు లేదా ఐదు బాదం పప్పులు లేదా జీడిపప్పులు తినాలి. 
* కూరగాయ ముక్కలు, ఆకుకూరలు, కొద్దిగా జొన్న, రాగి లేదా సజ్జ వీటిల్లో ఏదైనా ఒక దాని పిండితో తయారు చేసిన పుల్కాలను తీసుకుంటే చాలా మంచిది. 
* ప్రతి రోజూ ఉదయాన్ని ఒక క్యారెట్ లేదా ఓ ముల్లంగి లేదా ఒక యాపిల్ లేదా ఒక జామ పండు తీసుకోవచ్చు. 
* ఉదయాన్నే అల్పాహారం తీసుకున్న తర్వాత మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం, పుదీనా ఆకులు వేసి తయారు చేసుకున్న టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. 
* అల్పాహారంలో ప్రోటీన్లు, కొవ్వులతోపాటు కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యతను ఇవ్వాలి. 
* నెయ్యి, కోడిగుడ్లు, పాలు త‌దిత‌ర ఆహారాల‌ను తీసుకోవ‌డం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీనిపై మరింత చదవండి :