Astrology Zodiac Aquarius Wkn.htm

Notifications

కుంభం కుంభం
సహజమైన బలహీనతలు

కుంభరాశికి చెందినవారు తమదైన శైలిలో జీవనం సాగించటమేకాకుండా తాము చెప్పిందే వేదమన్నట్లు ప్రవర్తించటమనే లక్షణమే వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది. ఈ గుణం వల్ల ఇతురులు ఏది చెప్పినా పట్టించుకోని స్థితిలో ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తన పంథాను మార్చుకోరు. సంవాదాల్లో కానీ, వ్యక్తిత్వంలోగానీ తనకంటూ కొన్ని కట్టుబాట్లు నిర్దేశించుకుంటారు. వారు చేసిన సహాయనికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటుంటారు. వారి చుట్టూ ఆధిపత్య ధోరణిని ఉండటాన్ని సహించరు. తమపై అధికారుల వద్ద తల దించుకునే పరిస్థితి తలెత్తితే రాజీనామా చేయటానికి సిద్ధపడతారు కొన్ని సమయాల్లో కుంభరాశి వారిని అతిగా ప్రవర్తించేవారని అనడం కూడ జరుగుతుంది. మానవతా వాదంలో వీరు అంత త్వరగా అందరికి అర్ధం కారు.

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహంమచిలీపట్నం: భారతదేశం వ్యాప్తంగా వర్షాకాలం ప్రారంభమైనది. రుతుపవన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో పాముకాటు సంఘటనలు కూడా ప్రమాదకరమైన రీతిలో పెరుగుతున్నాయి. ఈ సంఘటనలను తరచుగా నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ, ఒక కీలకమైన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ఇది నిలిచినది. మ్యాన్‌కైండ్ గ్రూప్ కంపెనీ, రెండు దశాబ్దాలకు పైగా నాణ్యమైన పాముకాటు విరుగుడు(ఏఎస్వి) ఔషధంను అందిస్తూ ఎక్కువమంది అభిమానించే సంస్థగా నిలిచిన బీఎస్వీ, దేశవ్యాప్తంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక సమగ్ర ‘4ఏ’ కార్యాచరణను అమలు చేయడం ద్వారా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మందుల బాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి చెందినదిగా చెబుతున్న అంకాపూర్లోని ఒక గెస్ట్ హౌస్‌లో ఉన్న బాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, జూన్ 27న ఆర్మూర్ లోని భారత్ చంద్ర స్కూల్ ప్రిన్సిపాల్ అమెర్ ఖాన్‌పై మందుల బాలు, అతని మద్దతుదారులు దాడి చేశారు. స్కూల్‌లో ఉర్దూ బోధించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పోలీస్ అధికారి సమక్షంలోనే బాలు ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టడం, దుర్భాషలాడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై, బీజేపీ నేత తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకంమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాల్లో చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఇతరుల తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. చిన్ననాటి గురువులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధాన ఉపాధ్యాయులకు స్థానచలనం కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం