థాయ్‌లాండ్ ఐస్‌క్రీమ్
కస్టర్డ్ పౌడర్‌ను బాగా కలిపి అందులో 1/4 కప్ చల్లని పాలను...
కావలసిన పదార్థాలు:
కొబ్బరి పాలు: రెండు గ్లాసులు
మామిడి ముక్కలు: మూడు
ఫ్రెష్ క్రీమ్: 1/4 కప్
పంచదార పౌడర్: అరకప్
కస్టర్డ్ పౌడర్: నాలుగు టేబుల్ స్పూన్లు
పాలు: రెండు గ్లాసులు
ఇలా చేయండి:
కస్టర్డ్ పౌడర్‌ను బాగా కలిపి అందులో 1/4 కప్ చల్లని పాలను చేర్చి బాగా మిక్స్ చేయండి. మిగిలిన పాలను స్టౌవ్ మీద ఉంచి మరిగించండి. ఈ కస్టర్డ్ పౌడర్‌ను పాలతో కలిపి కాసేపు ఉడికించండి. బాగా గట్టిగా వచ్చాక దించేయండి. 1/4 కప్ చల్లని పాలుతో క్రీమ్‌ను కలిపి పంచదార పౌడర్‌ను అందులో కలపండి. ఇందులో కస్టర్డ్ మామిడి ముక్కలు, కొబ్బరి పాలు, ఎసెన్స్ పాలతో కలిపిన క్రీమ్ అన్నింటిని బాగా గిలకొట్టి ఈ మిశ్రమాన్ని ఒక ప్యాన్‌లో పోసి నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత తీసి సర్వ్ చేయొచ్చు. ఈ ఐస్‌క్రీమ్‌పై మీకు నచ్చిన పండ్ల ముక్కలతో అలంకరించుకోవచ్చు.