1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. కాంటినెంటల్

వింటర్ గ్రీన్ కబాబ్స్

వంటకాలు కాంటినెంటల్ బఠానీ పచ్చిమిరపకాయలు పాలకూర ప్యూరీ నూనె పచ్చి శెనగపప్పు క్యాప్సికమ్ యాలకుల పొడి
కావలసిన పదార్థాలు :
బఠానీలు... ఒక కప్పు
పచ్చిమిరపకాయలు... రెండు లేక మూడు
పాలకూర ప్యూరీ... అరకప్పు
నూనె... వేయించేందుకు సరిపడా
పచ్చి శెనగపప్పు... ఒక కప్పు
క్యాప్సికమ్... రెండు
యాలకుల పొడి... అర టీస్పూన్

తయారీ విధానం :
శనగపప్పును ముందుగా రెండు గంటలు నానబెట్టుకోవాలి. తరువాత బఠాణీలు, శనపప్పు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కొద్దిగా గోరు వెచ్చటి నూనె, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే మరికొన్ని పచ్చి మిరపకాయలు, యాలకుల పొడి, పాలకూర ప్యూరీ కూడా వేసి చేతితో బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని సమాన భాగాలుగా చేసుకుని, ఒక్కో భాగాన్ని అరచేతిలో చిన్న చిన్న పూరీలుగా వత్తుకోవాలి. అన్నీ తయారు చేసుకున్న తరువాత నూనెలో బాగా వేయించుకోవాలి. వింటర్ గ్రీన్ కబాబ్స్ రెడీ అయినట్లే...! అంతే వీటిని వేడి వేడి టమోటో సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.
About Writer
Hanumantha Reddy