1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. భారతీయ
  6. ఆవపిండితో టొమోటో తొక్కు

Tomato thokku with Mustard flour | ఆవపిండితో టొమోటో తొక్కు

వంటకాలు
కావలసిన పదార్థాలు :
టొమోటో ముక్కలు... పది కప్పులు
ఆవపిండి... అర కప్పు
ఉప్పు... రెండు కప్పులు
కారం... మూడు కప్పులు
మెంతిపొడి... నాలుగు టీ.
ఇంగువ... ఒక టీ.
పసుపు... నాలుగు టీ.
నువ్వుల నూనె... రెండు కప్పులు
ఆవాలు... ఒక టీ.

తయారీ విధానం :
టొమాటోల్ని కడిగి తుడిచి నాలుగు ముక్కలు చొప్పున కోయాలి. తరవాత ముక్కల్లోని నీరంతా బయటకు వచ్చి ఆవిరయ్యేవరకూ సుమారు పావుగంటసేపు ఉడికించాలి. ముక్కలు చల్లారాక ఉప్పు, కారం, ఆవపిండి వేసి కలపాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి కొద్దిగా నూనె వేడిచేసి ఆవాలు, పసుపు, ఇంగువ, వేసి తాలింపు పెట్టాలి.

ఈ పోపును టొమాటో ముక్కల మిశ్రమంలో కలిపి చివరగా మిగిలిన నూనెను కూడా పచ్చడిలో కలపాలి. ఇది సుమారు 3 నెలలవరకూ నిల్వ ఉంటుంది. అంతే ఆవపిండితో తయారైన టొమోటో తొక్కు సిద్ధమైనట్లే...!!
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి