1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

సగ్గు బియ్యంతో కిచిడీ

సగ్గుబియ్యంలో పొడి చేసిన వేరుశెనగ పప్పు పొడి
కావలసిన పదార్థాలు:
సగ్గు బియ్యం: పావు కేజీ
పచ్చిమిర్చిముక్కలు: నాలుగు టీ స్పూన్లు
జీలకర్ర: అర టీస్పూన్
వేరు సెనగ గింజలు నూనెతో వేయించినవి

వీటిని సిద్ధం చేసుకోండి:
సగ్గు బియ్యంను శుభ్రం చేసి కడిగి నీళ్లు వంపి ఓ గంటపాటు ఆరనివ్వాలి. వేరు సెనగపప్పును పొట్టు తీసి వేయించి పొడి చేయాలి.

ఇలా చేయండి:
సగ్గుబియ్యంలో పొడి చేసిన వేరుశెనగ పప్పు పొడి, ఉప్పు, మిరియాల పొడి కలపాలి. వేడయిన బాణలిలో కాస్త నెయ్యి లేదా నూనెను పోసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగాక పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించాలి. తర్వాత సగ్గుబియ్యం మిశ్రమం వేసి గరిటెతో కలుపుతూ ఉడికించాలి. సగ్గు బియ్యం ఉడికిన తర్వాత నిమ్మకాయ పిండి కొత్తిమీర తరుమును వేసి దించేయండి. ఈ కిచిడీని ఓ ప్లేట్‌‌లో తీసుకుని వేయించిన వేరుశెనగ పప్పుతో అలంకరించి సర్వ్ చేయొచ్చు.
About Writer
WD