1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. చిట్కాలు

అవాలు అన్నింటికి మంచిదే

అవాలు అన్నింటికి మంచిదే
పల్లెల్లో అమ్మమ్మలు ఇప్పటికీ పిల్లాడు లేదా పాప నలత చెందారంటే వెంటనే ఆవాలు నూరిపోయమంటారు. కడుపు నొప్పి అంటే చాలు ఆవాలు పోస్తారు. ఇది సాధారణ జనానికి కూడా తెలిసిన వైద్యం. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆవాలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అవేంటో మనమూ తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మందికి గర్భస్రావం జరుగుతుంటుంది. డాక్టర్ దగ్గరకు పరుగుపెట్టడం మామూలే. చాలా మందికి ఆందోళన ఉంది. అంతకంటే ముందుగా అందులో ఏమున్నాయో తెలుసుకుంటే సరిపోతుంది కదా.. ! తెల్ల ఆవాలలో గర్భస్రావ సంభావ్యతను తగ్గించే అవకాశం ఉంది. గర్భశిశువుకు చాలా ఉపయోగపడుతాయి.

సూక్ష్మజీవులను చంపేస్తుంది. ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. శరీరంలోని దాతు లోపం చాలా మందిని ఇబ్బంది కలిగిస్తుంది. ఆవాలు తీసుకుంటే శరీరంలోని దాతువులను సమతుల్యం చేయడానికి ఉపయోగ పడుతుంది. ఆయాసం, ఉబ్బసం ఉన్నవారు ఆవాలు తీసుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది.

నేత్ర రోగాలు, రేచీకటి ఉన్నవారు ఆవాలు తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. కీళ్ళవాతానికి, పక్షవాతానికి చాలా బాగా పనిచేస్తుంది. కడుపులోని నులిపురుగులను చంపివేడానికి ఆవాలు చాలా ఉపయోగ పడుతాయి. ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయి.
About Writer
పుత్తా యర్రం రెడ్డి