వర్షాకాలం వస్తోందంటే ఎంత డీసెంట్‌గా ఉన్నావారికైనా కాసేపు వానలో తడిస్తే బాగుండుననే కోరిక తన్నుకొస్తుంది. కొందరైతే ఇక ఆల్యమెందకని తడిచేస్తారు. వర్షాకాలం వస్తోందన్నా, శీతల కాలం వస్తందోన్నా రోగాలను వెంట తెస్తున్నాయనే విషయం మనకు ఎప్పుడూ గుర్తుండాలి.
అసలు విషయం మరిచాము. వర్షంలో తడిస్తే జుత్తు రాలిపోతుందా...? ఇది ప్రతి సగటు మహిళకు కలిగే ధర్మ సందేహమే. జుత్తుపై ప్రేమ లేని మహిళ ఉండదంటే ఆశ్చర్యపోనక్కరలేదు. మరీ మనలాంటి భారతదేశంలోనైతే అమ్మో జుత్తుకు ఇచ్చే ప్రాధాన్యతే వేరు. అయితే వర్షంలో తడిస్తే జుత్తు రాలడం ఖాయం.
వర్షాకాలం వచ్చిందంటే జుత్తుకు తంటాలు వచ్చినట్లే. వర్షంలో తడిస్తే జుత్తు వంకరుల పోతుంది. అలాగే వదిలిస్తే తిరులు కడుతుంది. ఇలా జరిగితే దువ్వే ప్రతిమారు వెండ్రుకులు రాలిపోతాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వర్షంలో తడిచిన వెంటనే వీలైనంత తొందరగా తేలికపాటి శాంపుతో స్నానం చేయాలి.
జెల్లులు వాడడం నిలిపివేస్తే మంచిది. తలపై ఉన్న చర్మాన్ని వీలైనంత తొందరగా పొడిగా చేయాలి. అంటే వెంట్రుకలు, తల ఆరబెట్టుకోవాలి. అలాగా చర్మానికి మసాజ్ చేయడం మంచిది. మరింత జాగ్రత్త తీసుకోవాలంటే స్విమ్మింగ్ సమయంలో వెంట్రుకలకు వాడే క్యాప్ ధరించడం వలన చాలా ఉపయోగం ఉంటుంది.
|